Shrihan Imitates Keerthi : బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం పదకొండో వారం నడుస్తోంది. ఇంట్లో పది మంది కంటెస్టెంట్లున్నారు. ఇందులో విన్నర్ అయ్యే అర్హత ఎవరికి ఉంది? అంటే టక్కున ఒక పేరు చెప్పడానికి ఎవ్వరూ లేరు. ఒక్కొక్కరికి ఒక్కో వీక్ పాయింట్ ఉంది. వాటిని వాళ్లు అధిగమించలేకపోతోన్నారు. రేవంత్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదు.. ఆ కోపంలో మాట్లాడే మాటలు, చేసే చేష్టలు అతనికే నెగెటివ్ అవుతోన్నాయి. ఇక శ్రీహాన్, శ్రీ సత్య, ఫైమాలు మాత్రం ఒకే రోగంతో, వీక్ నెస్‌తో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ముగ్గురూ కూడా వెటకారం చేయడంలో ఒకరిని మించి ఒకరుంటారు. అందరికంటే ఫైమా ఈ విషయంలో ముందుంటుంది. కానీ నాగార్జున గత వారం క్లాస్ పీకడంతో కాస్త తగ్గింది. కానీ ఫైమా తగ్గినా శ్రీహాన్, సత్యలు మాత్రం ఆగడం లేదు. నిన్నటి ఎపిసోడ్‌లో కీర్తిని ఇమిటేట్ చేసి శ్రీ సత్య దిగజారిపోయింది. మళ్లీ రాత్రికి వచ్చి క్షమించమని సత్య అడిగేసింది.


 



ఇక ఇప్పుడు వదిలిన ప్రోమోలోనూ శ్రీహాన్ మళ్లీ కీర్తిని టార్గెట్ చేశాడు. ఇమిటేట్ చేశాడు. అయితే కీర్తికి కూడా ఈసారి మండినట్టుంది. శ్రీహాన్‌కు తిరిగి కౌంటర్ వేసినట్టుగా ఇమిటేట్ చేసింది. కానీ శ్రీహాన్ ఇలా తనని తాను దిగజార్చుకుంటూ విన్నర్ అయ్యేఅర్హతను కోల్పోతోన్నాడు.


మొదట్లో శ్రీహాన్ విన్నర్ లేదా టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ రాను రాను శ్రీహాన్ తన అసమర్థను చాటుతున్నాడు. ఒక్క నిర్ణయం తీసుకోవడంలో కూడా తన తెలివిని ప్రదర్శించడం లేదు. పైగా ఇలా కీర్తి, ఇనయలను ఇమిటేట్ చేస్తూ తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకుంటున్నాడు. ఎప్పుడైతే సత్యతో స్నేహం మొదలైందో అప్పటి నుంచి శ్రీహాన్ గ్రాఫ్ కాస్త పడిపోతూనే వస్తోంది.


Also Read : Bigg Boss 6 Telugu Prize Money : బిగ్ బాస్ షోలో కొత్త పథకం.. ప్రైజ్ మనీలో కోతలు.. చివరకు మిగిలేది ఎంతంటే?


Also Read : Samantha Yashoda overseas Collections : సమంత స్టామినా ఇదే.. అక్కినేని వారు అందుకోలేనంత ఎత్తులో


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook