Shrihan Surprises Siri with Diamond Ring తన ప్రియురాలు సిరి పుట్టిన రోజు సందర్భంగా శ్రీహాన్ ఆమెను సర్ ప్రైజ్ చేశాడు. డైమండ్ రింగ్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు శ్రీహాన్. ఇక సిరి బర్త్ డే వేడుకలకు సంబంధించిన వీడియోను ఇప్పుడు సిరి నెట్టింట్లో షేర్ చేయగా.. అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో సిరి, శ్రీహాన్ క్యూట్ ఫ్యామిలీకి సంబంధించిన విజువల్స్ అందరినీ మెప్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



సిరి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో షన్నుతో చేసిన రొమాన్స్, ఉన్న రిలేషన్ షిప్ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ భార్యాభర్తల కంటే తక్కువ లవర్స్ కంటే ఎక్కువ అన్నట్టుగా బిగ్ బాస్ ఇంట్లో ప్రయాణం సాగించారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఇవన్నీ చూసి విసుగెత్తిన దీప్తి సునయన.. చివరకు షన్నుకి బ్రేకప్ చెప్పేసింది. సిరితో శ్రీహాన్ కూడా దూరంగా ఉన్నాడనే టాక్ వచ్చింది.


కానీ ఒకరోజు రవి ఇంట్లో సిరి, శ్రీహాన్ కలిసి కనిపించారు. దీంతో ఈ ఇద్దరూ విడిపోలేదు కలిసే ఉన్నారనే విషయం అందరికీ అర్థమైంది. అయితే శ్రీహాన్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ సత్యతో కాస్త అలానే ప్రవర్తించాడు. కానీ మరీ షన్ను సిరిల అంత విచ్చలవిడిగా ప్రవర్తించలేదు. ముద్దులు పెట్టుకోలేదు. కానీ హగ్గుల్లో మాత్రం వారికి సరిసమానంగానే ఉన్నాడు.


బిగ్ బాస్ ఇంట్లో ఏం జరుగుతుంది.. పరిస్థితులు ఎలా ఉంటాయో సిరికి తెలుసు కాబట్టి.. శ్రీహాన్‌కు సలహాలు ఇచ్చింది. ఎవరితో ఎలా ఉండాలో.. ఎంత వరకు ఉండాలో హింట్లు ఇచ్చి వచ్చింది. అలా తన ప్రేమికుడికి విజయపథంలో తోడుగా ఉంది. అలా శ్రీహాన్ క్యాష్ ప్రైజ్ మనీ విన్నర్‌గా నిలిచాడు. రేవంత్‌ టైటిల్ విన్నర్ అయ్యాడు.


ఇక సిరికి శ్రీహాన్ విజయం చూసి కడుపు నిండిపోయినట్టుంది. ఇప్పుడు శ్రీహాన్ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ చూసి గాల్లో తేలిపోయినట్టుంది. సిరి బర్త్ డే సందర్భంగా శ్రీహాన్ స్పెషల్‌గా డైమండ్ రింగ్‌ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసి సిరి ముద్దుల వర్షాన్ని కురిపించింది. కేక్ కట్ చేసి సిరి బర్త్ డేను శ్రీహాన్ సెలెబ్రేట్ చేశాడు. తన పెట్స్, తన కొడుకు, తన ప్రేమికుడు శ్రీహాన్‌తో సిరి ఫుల్ ఖుషీగా తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి