Shruti Haasan Cold war With Waltair Veerayya మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవర్సీస్‌లో వాల్తేరు వీరయ్య దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా దుమ్ములేపేస్తోంది. మొదటి వారాంతంలోనే వీరయ్య సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇక వీర సింహా రెడ్డి ఒక రోజు ముందు రిలీజ్ అయినా కూడా వీరయ్య కలెక్షన్లను అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు వీరయ్య దూకుడు ముందు వీర సింహా రెడ్డి కాస్త తగ్గినట్టుకనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వాల్తేరు వీరయ్య సక్సెస్ పట్ల టీం అంతా కూడా ఫుల్ ఖుషి అవుతోంది. కానీ ఇంత వరకు వీరయ్య సక్సెస్ మీద శ్రుతి హాసన్ స్పందించలేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డుమ్మా కొట్టినప్పటి నుంచి శ్రుతి హాసన్‌కు, వీరయ్య టీంకు మధ్య గ్యాప్ ఉందనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. చివరకు స్టేజ్ మీదే చిరంజీవి కౌంటర్లు వేశాడు. ఒంగోలు ఏం తిందో.. ఎవరు బెదిరించారో గానీ ఆరోగ్యం బాగా లేదంట.. అందుకే రాలేకపోయిందని మెసెజ్ పెట్టిందంటూ చిరు చెప్పుకొచ్చాడు.


అయితే కనీసం శ్రుతి హాసన్ సక్సెస్ సెలెబ్రేషన్స్‌కు అయినా వస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ శ్రుతి హాసన్ అక్కడికి కూడా రాలేకపోయింది. శ్రుతి హాసన్ ఇలా వీరయ్య టీంకు దూరంగా ఉండటతో ఏదో జరిగి ఉంటుందని, అందుకే సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో సైతం పార్ట్ అవ్వడం లేదని తెలుస్తోంది.


మరి నిజంగానే వాల్తేరు వీరయ్య టీంతో శ్రుతి హాసన్‌కు ఇబ్బందులున్నాయా? అందుకే రావడం లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే శ్రుతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చక్కర్లు కొట్టేస్తోంది. ఈవెంట్లకు పిలిస్తే రాలేనంత బిజీగా అయితే కనిపించడం లేదు. శ్రుతి హాసన్ చేతిలో ఒక్క సలార్ తప్పా ఇంకో సినిమా ఏది కూడా లేదు. మరి శ్రుతి హాసన్ ఈవెంట్లకు ఎందుకు దూరంగా ఉంటుందనే విషయం మీద మాత్రం క్లారిటీ రావడం లేదు.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook