Shruti Hassan Knee injury Angle సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతి హాసన్ ముందుంటుంది. శ్రుతి హాసన్ తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. అయితే అప్పుడప్పుడు తనకు చిరాకు పుట్టించేలా ప్రశ్నలు వేస్తుంటారు నెటిజన్లు. వాటికి సైతం తన సమయస్పూర్తిని ప్రదర్శిస్తూ అదిరిపోయేలా ఆన్సర్లు ఇస్తుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా శ్రుతి హాసన్ ఇలానే తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో కొంత మంది ఎప్పుడూ అడిగే రొటీన్ ప్రశ్నలు అడిగేశారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడిగితే.. ఎప్పుడూ ఇదే ప్రశ్న విని బోర్ కొడుతోంది? అంటూ దాటేసింది శ్రుతి హాసన్. కానీ సమాధానం మాత్రం చెప్పలేదు.


ఎప్పుడూ నల్ల దుస్తులే ఎందుకు ధరిస్తారు అని ఇంకో నెటిజన్ అడిగితే.. ఎప్పుడూ ఇదే ప్రశ్ననా? అంటూ అనేసింది. అయితే మరో నెటిజన్ మాత్రం మొన్నటి మోకాళ్ల గాయంపై కౌంటర్లు వేసినట్టుగా ప్రశ్న అడిగాడు. మోకాళ్ల యాంగిల్ ఎలా ఉంది? అని దారుణంగా అడిగేశాడు.


[[{"fid":"264604","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


దానికి శ్రుతి హాసన్ తన మోకాళ్లను చూపించింది. కొంచెం వాచింది.. కానీ ఇప్పుడు తగ్గాయి.. అంత నొప్పి ఏం అనిపించడం లేదు అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ సమాధానం మీద కూడా శ్రుతి హాసన్‌ను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి శ్రుతి హాసన్ పెట్టిన చిట్ చాట్ సెషన్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.


ఈ ఏడాది శ్రుతి హాసన్‌కు బాగానే కలిసి వచ్చేట్టుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో రెండు సినిమాలతో దిగగా.. అవి బ్లాక్ బస్టర్‌లు అయ్యాయి. ఇక ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రానున్న సలార్ సినిమాలోనూ శ్రుతి హాసన్ కనిపించనుంది. ఆద్య అనే పాత్రలో శ్రుతి హాసన్ కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక శంతనుతో పెళ్లి విషయం మీద మాత్రం శ్రుతి హాసన్ నోరు విప్పడం లేదు. పెళ్లి అయితే ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం లేనట్టుగానే కనిపిస్తోంది.


Also Read:  Priyadarshi Balagam : బలగం ఆమెకే అంకితం.. అమ్మ కాదు అత్తమ్మ.. ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్


Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook