Ys Jagan CBI Cases: ఈ నెల 19 నుంచి జగన్ అక్రమాస్థుల కేసుల విచారణ

Ys Jagan CBI Cases: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. వాయిదాలు, ఇతర కారణాలతో ఇప్పటి వరకూ జరగని సీబీఐ అక్రమాస్థుల కేసుల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 6, 2024, 05:26 PM IST
Ys Jagan CBI Cases: ఈ నెల 19 నుంచి జగన్ అక్రమాస్థుల కేసుల విచారణ

Ys Jagan CBI Cases: ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఘోర పరాజయం ఎదురైంది. వివిధ కారణాలతో ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. న్యాయమూర్తి బదిలీ కావడం కూడా మరో కారణం. ఇప్పుడికి ఈ నెల 19 నుంచి జగన్‌పై ఉన్న అక్రమాస్థుల కేసుల విచారణ తిరిగి ప్రారంభిస్తున్నట్టుగా సీబీఐ కోర్టు వర్గాలు తెలిపాయి.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్థుల కేసులో 127 మంది నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లపై ఈ నెల 19వ తేదీన విచారణ ప్రారంభం కానుంది. వాస్తవానికి బుధవారం ఈ కేసులు లిస్టింగ్‌కు వచ్చిన తరువాత వాయిదాలు కోరడంతో 19వ తేదీకు వాయిదా పడింది. ఇకపై ఈ కేసుల రెగ్యులర్ విచారణ కొనసాగనుందని హైదరాబాద్ సీబీఐ కోర్టు కొత్త న్యాయమూర్తి రఘురామ్ తెలిపారు. జగన్ అక్రమాస్థుల కేసును రెండు నెలల్లో పరిష్కరించాలని సీబీఐ కోర్టును తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. మరోవైపు సీబీఐ కోర్టు న్యాయమూర్తి కూడా బదిలీ అయ్యారు. దాంతో విచారణ ఆగిపోయింది. గత ఐదేళ్ల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగులో ఉన్న కేసులపై విచారణ ప్రారంభించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో జాప్యం కూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపధ్యంలో సీబీఐ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇప్పుడు వైఎస్ జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే కావడంతో ఇక విచారణకు హాజరుకాకుండా మినహాయింపు కోరేందుకు ఆస్కారముండదు. విధిగా మళ్లీ సీబీఐ కోర్టుకు హాజరవాల్సిందే. ఓ విధంగా వైఎస్ జగన్‌కు ఇది ఇబ్బందే అయినా కేసుల విచారణ త్వరగా ముగిస్తే మరో విధంగా మంచిదే. 

Also read: Southwest Monsoon: వేగంగా కదులుతున్న రుతు పవనాలు, ఏపీలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News