Siddharth comments: సినీ నటుడు సిద్ధార్థ్ తెలియని వారుండరు. సినిమాల్లోనే కాదు..నిత్యం వార్తల్లోనూ స్పెషల్‌గా నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కేజీయఫ్‌, కేజీయఫ్‌-2 సినిమాలు అఖండ విజయాన్ని సాధించాయి. కేజీయఫ్‌-2పై తాజాగా నటుడు సిద్ధార్థ్‌ స్పందించారు. ఈ మూవీని పాన్‌ ఇండియా అని పిలుస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఎస్కేప్‌ లైవ్‌ అనే సిరీస్‌లో సిద్ధార్థ్‌ నటిస్తున్నారు. ఇందులోభాగంగానే ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పాన్‌ ఇండియా కాన్సెప్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్‌ ఇండియా అంటేనే వినడానికి ఫన్నీగా ఉందని..తాను 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో ఎన్నో చిత్రాలు చేస్తున్నానన్నారు. తమిళ సినిమాల్లో చేస్తే తమిళయన్‌గా, తెలుగు చిత్రాల్లో చేస్తే పక్కా తెలుగు అబ్బాయిగా నటించానని చెప్పారు. ఏ భాషలో పనిచేస్తే ఆ భాషలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునేవాడని తెలిపారు. తాను వేరే వాళ్ల చేత డబ్బింగ్ చెప్పించుకోనన్నారు. 


తన వరకు ఏ చిత్రాలైన ఇండియన్స్ ఫిల్మ్స్‌ అని పిలుస్తానని స్పష్టం చేశారు సిద్ధార్థ్. పాన్‌ ఇండియా అంటే తనకు అగౌరవంగా అనిపిస్తుందన్నారు. తాను ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకోనని తేల్చి చెప్పారు. హిందీ భాష నుంచి విడుదలైన మూవీలు ప్రేక్షాదరణ పొంది..విజయం సాధిస్తే వాటిని బాలీవుడ్‌ అని అంటారు. కానీ అదే ప్రాంతీయ చిత్రాలు హిట్ అయితే పాన్‌ ఇండియా అని పిలవడం ఏంటని ప్రశ్నించారు. వాటిని భారతీయ చిత్రం అని పిలవొచ్చు కదా అని సిద్ధార్థ్‌ అభిప్రాయపడ్డారు. కేజీయఫ్‌ సినిమా విషయంలో కన్నడ మూవీ అని అనొచ్చుకాదా ..అని ప్రశ్నించారు. పాన్ అంటే ఏంటో ఇప్పటికీ తనకు తెలియదన్నారు. ఆ పదం తనకు నవ్వును తెప్పిస్తుందని సిద్ధార్థ్ చెప్పారు.


Also read:KA Paul Comments: చంద్రబాబులా డబ్బులు పట్టుకొని పారిపోను! కేఏ పాల్ సంచలన కామెంట్లు..


Also read:Supreme Court on GST: జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook