KA Paul Comments: చంద్రబాబులా డబ్బులు పట్టుకొని పారిపోను! కేఏ పాల్ సంచలన కామెంట్లు..

KA Paul Comments: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వడంపై ఏపీలో ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. కేసీఆర్ ముగ్గురు పారిశ్రామిక వేత్తలనే పెద్దల సభకు పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 01:20 PM IST
  • రాజ్యసభ సీట్లను కేసీఆర్ అమ్ముకున్నారు- పాల్
  • గతంలో నాకు రాజ్యసభ ఆఫర్ వచ్చినా వదులుకున్నా- పాల్
  • చంద్రబాబులా డబ్బులు తీసుకుని పారిపోను- పాల్
KA Paul Comments: చంద్రబాబులా డబ్బులు పట్టుకొని పారిపోను! కేఏ పాల్ సంచలన కామెంట్లు..

KA Paul Comments: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వడంపై ఏపీలో ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. కేసీఆర్ ముగ్గురు పారిశ్రామిక వేత్తలనే పెద్దల సభకు పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాలు., భూకబ్జా కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురికి సీఎం కేసిఆర్ రాజ్యసభ సీట్లు ఇచ్చారని ఆరోపించారు.తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ నిజ స్వరూపం బయటపడిందన్నారు కేఏ పాల్. ఉద్యమకారులను పట్టించుకోకుండా బడాబాబులకు కేసీఆర్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో  కేసీఆర్ తమ సొంత ప్రయోజనాలు చూసుకున్నారని అన్నారు.

ఢిల్లీ నుండి గల్లీ వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న తనపై దాడులు చేయిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. శాంతి సభ జరగకుండా పోలీసులతో అడ్డుకున్నారని చెప్పారు.
కేసీఆర్ అమరవీరుల ద్రోహి అన్నారు. రాజ్యసభ సీట్లు ఇవ్వడానికి తెలంగాణలో మంచివాళ్లు ఎవరూ లేరా.. భూకబ్జాదారులే దొరికారా అంటూ కేఏ పాల్ ధ్వజమెత్తారు. ప్రజా సేవ చేసిన వాళ్లను పెద్దల సభకు పంపిస్తారు కాని ప్రజలను దోచుకునేవాళ్లను కాదన్నారు. కరోనా సమయంలో ప్రజలను భయపెట్టించి కోట్లాది రూపాయలు సంపాందించిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  ఈడీ దర్యాప్తులో 500 కోట్ల రూపాయలతో హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారని పాల్ ఆరోపించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టిన అవినీతి గ్రానెట్ వ్యాపారికి రాజ్యసభకు వెళ్లే అర్హత లేదన్నారు కేఏ పాల్. టీఆర్ఎస్ పార్టీ పత్రిక ఎండీరి రాజ్య సభ సిటు ఇస్తావా కేసీఆర్ అంటూ నిలదీశారు. వీళ్లకు సీటు ఇవ్వడం కంటే దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటరన్నారు కేఏ పాల్.

2005లో చంద్రబాబు తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తిరస్కరించానని చెప్పారు కేఏ పాల్. 2012లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఆఫర్ వచ్చినా వద్దని చెప్పానని తెలిపారు. తాను ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబులా డబ్బులు తీసుకుని తాను హైదరాబాద్ నుంచి ఏపీకి పారిపోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. బంగారు తెలంగాణ తేవడానికి ముందుకు వచ్చానన్నారు. మోడీ ప్రభుత్వంపై తాను ఒక్కడినే పోరాడుతున్నానని..  రాహుల్ గాంధీ పడుకొన్నారని అన్నారు. అంబేద్కర్, పూలే ఆశయాలను నిలబెట్టడానికి తనతో కలిసి రావాలని కేఏ పాల్ పిలుపిచ్చారు. యూపీలో బలహీనమైన బీఎస్పీ పార్టీ తెలంగాణలో ఎందుకంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. 

READ ALSO: Big Shock To TRS: కేసీఆర్ కు బిగ్ షాక్! కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ సీనియర్ నేత..

READ ALSO: Kinnera Mogulaiah: నా నోట్లో మన్ను పోస్తారా.. పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా! కిన్నెర మొగులయ్య సంచలనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News