Siddhu Jonalagadda in Raviteja Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా.. మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన రైడ్.. సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేరుకి రీమేక్ అయినప్పటికీ.. హరీష్ శంకర్ ఈ సినిమాకి తనదైన స్టైల్ లో మార్పులు. చేర్పులు చేశారు.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం సినిమాకి సంబంధించిన టీజర్, పాటలు.. చూస్తేనే అర్థం అవుతుంది. అయితే ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఒక కామియో పాత్రలో కనిపించనున్నారట. 


ఈ మధ్యనే ఈ పాత్రకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. డీజే టిల్లు గా అందరినీ ఆకట్టుకున్న.. సిద్దు జొన్నలగడ్డ మిస్టర్ బచ్చన్ సినిమాలో.. ఒక ఫైట్ సీన్ లో కనిపించబోతున్నారట. దాదాపు రెండు మూడు నిమిషాల పాటు తెరమీద కనిపిస్తారట. ఫైట్ లో రవితేజ కి హెల్ప్ చేస్తారా లేక.. రవితేజ తోనే ఫైట్ చేస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది.


ఏదేమైనా ఇద్దరి ఎనర్జీ ఆ సీన్ కి హైలైట్ అవుతుంది. ఈ సినిమా కోసం ఆసక్తికి ఎదురుచూస్తున్న అభిమానులలో సిద్దు జొన్నలగడ్డ క్యామియో అంచనాలను భారీగా పెంచింది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.


నిజ జీవితంలో ఎక్కువ సేపు జరిగిన ఒక ఇన్కమ్ ట్యాక్స్ రెయిడ్ ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతోంది. ఈ సినిమాలో రవితేజ..ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు అందుకుంటున్నారు రవితేజ.. కనీసం ఈ సినిమాతో అయినా.. మళ్లీ హిట్ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.


Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter