Sidharth Shukla cremation: సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తి, దుఖసాగరంలో షెహనాజ్ గిల్
Sidharth Shukla cremation: సిద్ధార్థ్ శుక్లా చివరి చూపు కోసం అతడి గాళ్‌ఫ్రెండ్ షెహనాజ్ గిల్, రాఖీ సావంత్, నిక్కీ టంబోలి, ప్రిన్స్ నరుల-యువికా చౌదరి, షెహబాజ్, రషమి దేశాయ్, అసిం రియాజ్, అర్జున్ బిజ్లాని, రాహుల్ మహజన్, వికాస్ గుప్త వంటి సెలబ్రిటీలు అతడి నివాసానికి, అక్కడి నుంచి ఒషివరలోని స్మశానవాటికకు (Oshiwara crematorium) వచ్చారు.
Sidharth Shukla cremation: సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని ఓషివర స్మశానవాటికలో సిద్ధార్థ్ శుక్లా భౌతికకాయానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సిద్ధార్థ్ శుక్లాకు అంతిమ నివాళి ఘటించేందుకు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు, హిందీ టీవీ పరిశ్రమకు చెందిన అనేక ప్రముఖులు ముందుగా కూపర్ హాస్పిటల్‌కి చేరుకోగా.. ఇంకొంత మంది సిద్ధార్థ్ శుక్లాను కడసారి చూసుకునేందుకు ఒషివరలోని అతడి నివాసానికి, ఒషివర శ్మాశానవాటికకు తరలివచ్చారు.
చిన్నారి పెళ్లి కూతురు (Chinnari pelli kuthuru) సీరియల్‌తో పాటు బిగ్ బాస్ 13 విజేతగా, మోడల్‌గా, నటుడిగా ఎంతో మంది ఆడియెన్స్‌కి చేరువైన సిద్ధార్థ్ శుక్లాకు బుల్లి తెరపై భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ శుక్లాను చివరిసారి చూసుకునేందుకు భారీ సంఖ్యలో సన్నిహిత మిత్రులు, అభిమానులు ఓషివర శ్మశానవాటికకు చేరుకున్నారు.
సిద్ధార్థ్ శుక్లా చివరి చూపు కోసం అతడి గాళ్‌ఫ్రెండ్ షెహనాజ్ గిల్, రాఖీ సావంత్, నిక్కీ టంబోలి, ప్రిన్స్ నరుల-యువికా చౌదరి, షెహబాజ్, రషమి దేశాయ్, అసిం రియాజ్, అర్జున్ బిజ్లాని, రాహుల్ మహజన్, వికాస్ గుప్త వంటి సెలబ్రిటీలు అతడి నివాసానికి, అక్కడి నుంచి ఒషివరలోని స్మశానవాటికకు (Oshiwara crematorium) వచ్చారు.
Also read : Chinnari Pelli Kuthuru: ఒకే సీరియల్.. ముగ్గురు నటులు మృతి.. విషాదంలో అభిమానులు
సిద్ధార్థ్ శుక్లాకు అత్యంత సన్నిహితురాలైన షెహనాజ్ గిల్‌ని ఓదార్చడం ఎవరితరం కాలేదు. సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో (Sidharth Shukla dies of heart attack) మృతి చెందాడని తెలిసినప్పటి నుంచి ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదని, అదే పనిగా ఎడుస్తూనే ఉందని హెహనాజ్ గిల్ (Shehnaaz Gill) కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు తెలిపారు.
Also read: Bigg Boss Telugu 5: ఈ 5 గురి కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?? వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook