Chinnari Pelli Kuthuru: ఒకే సీరియల్.. ముగ్గురు నటులు మృతి.. విషాదంలో అభిమానులు

హిందీలో హిట్ అయిన బాలికా వదు తెలుగులో "చిన్నారి పెళ్లి కూతురు"గా ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైంది. ఈ సీరియల్ లో నటించిన సిద్ధార్థ్ శుక్లా, ప్రత్యూష బెనర్జీ, సురేఖ్ సిక్రి ముగ్గురు మరణించారు. వారెలా మరణించారంటే...
 

  • Sep 02, 2021, 17:06 PM IST

విచారం ఏమిటంటే సిద్ధార్థ్ శుక్లా ఈ రోజు గుండెపోటుతో మరణించగా,సురేఖ్ సిక్రి కూడా గుండెపోటుతో మరణించారు, ప్రత్యూష బెనర్జీ 2016 లో ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఎంత గానో తెలుగులో ప్రజాదరణ పొందిన కారణంగా వీరి మరణాలతో బాలీవుడ్ వర్గాలే కాకుండా, తెలుగు ప్రజలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. 
 

1 /5

బాలీవుడ్ బుల్లితెర నటుడు మరియు బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా 40 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో కలెక్టర్ గా నటించిన సిద్ధార్థ్ చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఉదయం గుండెపోటు రావటంతో.. కూపర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడని సిద్ధార్థ్ తల్లి మరియు ఇద్దరు సోదరీమణులు తెలియజేసారు.  (Pic Courtesy: Instagram/Sidharth Shukla)  

2 /5

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో కళ్యాణి దేవి పాత్రలో నటించిన ప్రముఖ నటి సురేఖ సిక్రీ కూడా ఇదే సంవత్సరం జూలై 16 న మరణించారు. 75 సంవత్సరాల వయసులో సురేఖ సిక్రీ గుండెపోటుతో మరణించింది.  (Pic Courtesy: File Photo)  

3 /5

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ లో  ఆనంది జగదీష్ సింగ్ పాత్ర పోషించిన ప్రత్యూష బెనర్జీ ఏప్రిల్ 1, 2016 న ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యూష బెనర్జీ మరణంతో ఆమె కుటుంబం, స్నేహితులు మరియు అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తింది. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  తమ కుమార్తెతో లివింగ్ రిలేషన్‌లో ఉన్న రాహుల్ రాజ్ ప్రత్యూష బెనర్జీని మానసికంగా హింసించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు శంకర్ మరియు సోమ ముంబైలోని లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.  (Pic Courtesy: File Photo)  

4 /5

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో జిల్లా కలెక్టర్ శివరాజ్ శేఖర్ పాత్రను సిద్ధార్థ్ శుక్లా పోషించగా, ఆనంది జగదీష్ సింగ్ ప్రత్యూష బెనర్జీకి నటించారు. అప్పట్లో తెలుగులో అనువాదం చేసిన ఈ సీరియల్ తెలుగు రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.  (Pic Courtesy: MX player)  

5 /5

ఈ సీరియల్ హిందీలోనే కాక తెలుగులో కూడా చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. ఇందులోని కథ మొత్తం బాల్య వివాహం నుండి ప్రారంభం అవటం, చిన్నారి ఆనంది పడే కష్టాలు మరియు పెరిగి పెద్ద అయ్యాక మళ్లి తన జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలు పూర్తిగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్నాయి. పూర్వపు కాలంలో జరిగే బాల్య వివాహాల చుట్టూ జరిగే ఈ కథాంశం అందరిని ఆకట్టుకుంది.  (Pic Courtesy: YouTube)