Singer Chinmayi on Shrihan Blackmail Video సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ఎదుర్కొనే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. చిన్మయి ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద స్పందిస్తూనే ఉంటుంది. చిన్మయి ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లల గురించి, వారు సమాజంలో ఎదుర్కొనే బాధల గురించి పోస్టులు చేస్తూనే ఉంటుంది. తాజాగా సిరి, శ్రీహాన్‌ల వీడియో మీద స్పందించింది. శ్రీహాన్, సిరిలు ఓ పిల్లాడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా శ్రీహాన్ తన పిల్లాడిని క్యూట్‌గా బెదిరించి, భయపెట్టేందుకు చూశాడు. ఈ క్రమంలో శ్రీహాన్ తనని తాను కొట్టుకున్నాడు. ఇంకోసారి ఇలా చేస్తావా? చెప్పిన మాట వింటావా? లేదా? అని బెదిరించేందుకు ప్రయత్నించాడు. శ్రీహాన్ ఇలా తనని కొట్టుకోవడం చూసి ఆ పిల్లాడు ఏడ్చేశాడు. ఇంకోసారి ఇలా చేయను.. చెప్పినట్టు వింటాను అని ఏడ్వసాగాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న సిరి తెగ నవ్వేస్తూ వచ్చింది. క్యూట్ డ్యాడీ అంటూ వీడియోను షేర్ చేసింది.


దీనిపై సింగర్ చిన్మయి స్పందించింది. నిన్న ఈ వీడియో మీద స్పందించిన చిన్మయి.. ఆ తరువాత పోస్ట్‌ను డిలీజ్ చేసిందట. దానిపై చిన్మయి క్లారిటీ ఇచ్చింది. నేను నిన్న చేసిన ఈ వీడియో డిలీట్ అయింది.. ఎందుకంటే ఒరిజినల్‌గా చేసిన వారు దీన్ని డిలీట్ చేశారు.. అందుకే నా దాంట్లో కూడా డిలీట్ అయిందన్నట్టుగా చిన్మయి చెప్పుకొచ్చింది.


 



ఇప్పుడు కూడా నేను నా మాటలకే కట్టుబడి ఉన్నాను.. మనది మనం కొట్టుకోవడం, బాధించుకోవడం తప్పే. ఇలా మీది మీరు కొట్టేసుకుని, బాధపెట్టుకోవడం పిల్లలపై ప్రభావం చూపెడుతుంది.. సైకోలుగా మార్చుతుంది.. ఇండియాలో చాలా మంది పేరెంట్స్ ఇలానే ఉంటారు.. మీది మీరు కొట్టేసుకుని బ్లాక్ మెయిల్ చేసుకుని పిల్లల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు..


ఇలాంటివి ఇప్పటికైనా ఆపేయాలి.. అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది. అయితే చిన్మయి షేర్ చేయడంతో ఈ వీడియోలోని ఇంకో యాంగిల్‌ను ఇప్పుడు జనాలు చూడటం ప్రారంభించేశారు. మొత్తానికి శ్రీహాన్ చేసిన ఈ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్న స్పందనలకు దారి తీస్తోంది.


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి