ఆ గాత్రం వింటే మళ్లీ మళ్లీ వినాలిపిస్తుంది. ఎందుకంటే ఆ గొంతులోని ఆ మాధుర్యం గొప్పతనం అలాంటిది.  భాష ఏదయినా స్పష్టమైన ఉచ్ఛారణకి పెట్టింది పేరు ఆ సింగర్. ఆమె మరెవరో కాదు ప్రముఖ సినీ నేపథ్యం గాయని పి. సుశీల (Pulapaka Susheela). నేడు టాలీవుడ్ దిగ్గజ గాయని పుట్టినరోజు. నేడు 85వ వసంతంలోకి అడుగుపెడుతున్న సింగర్ పి సుశీలకు పలు రంగాల ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు  (Happy Birthday P Susheela) తెలుపుతున్నారు. తెలుగు వారి గౌరవానికి ప్రతీకగా నిలిచిపోయే వ్యక్తులలో లెజెండరీ సింగర్ సుశీల ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.



 


విజయనగరంలో 1935 నవంబరు 13న సుశీల జన్మించారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఆమె వివాహం డాక్టర్ మోహనరావుతో జరిగింది. సింగర్‌గా దాదాపు 6 దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఆమె అధిగమించారు. దాదాపు 50 వేల పాటలు అవలీలగా పాడి ప్రేక్షకులను మెప్పించారు. ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ప్రాంతీయ పురస్కారాలు, అనేక రాష్ట్ర అవార్డులు సొంతం చేసుకున్నారు.



పద్మ భూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల ఆలపించిన టాప్ 10 తెలుగు పాటలు ఇవే..




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook