Doctorate to Gangadhara Shastry: తెలుగులో ఫేమస్ సింగర్, ప్రవచనకర్త ఎల్.వి గంగాధర శాస్త్రి కి అరుదైన గౌరవం దక్కుతోంది. మధ్యప్రదేశ్లోని మహర్షి పారాణి సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది. ఇండియన్ సంస్కృతిని పరిరక్షించడంలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథముగా ప్రతి హిందూ భావించే భగవద్గీతలోని 700 శ్లోకాలను స్వయంగా సంగీతం అందించి తెలుగులో తాత్పర్య సహితంగా ఆయన అందించిన గానామృతం వింటుంటే భగవద్గీతను స్వయంగా దర్శిస్తున్న అనుభూతి కలిగేలా రికార్డు చేసి విడుదల చేసి ఆయన నేటి తరానికి ఒక ఘనిలా అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గీతా ప్రచారమే తన జీవితం గా మార్చుకున్న ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటిస్తున్నామని సదరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య సిజి విజయ్ కుమార్ వెల్లడించారు. మే 214 వ తేదీన ఉదయం 11 గంటలకు ఉజ్జయినిలో జరిగే ఈ యూనివర్సిటీ నాలుగవ స్థాపనోత్సవం లో ఆయనకు గౌరవ డాక్టరేట్ తో సన్మానం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.  


Also Read: Samantha Mistake: తెలిసీ తప్పు చేస్తున్న సమంత.. ఇలా అయితే కష్టమే?


ఇక ఈ విషయం తెలుసుకున్న గంగాధర శాస్త్రి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ కి, విశ్వవిద్యాలయం ఉపకులపతి విజయ్ కుమార్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ విశ్వవిద్యాలయం నుంచి గౌరవం పొందడం తనకు సముచితమైన అదృష్టంగా భావిస్తున్నానని గంగాధర శాస్త్రి ఈ సంధర్భంగా చెప్పుకొచ్చారు.


తనకు లభించిన ఈ గౌరవం జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు భగవద్గీత ప్రయాణంలో సహకరించిన భార్య బిడ్డలకు మార్గదర్శకత్వం చేసిన గురువులకు భగవద్గీత అభిమానులకే చెందుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఆయన స్థాపించిన భగవద్గీత ఫౌండేషన్ ద్వారా గీతా ప్రచారం మాత్రమే కాదు పేద  విద్యార్థులకు, అనాధ బాలబాలికలకు, వికలాంగులకు వృద్ధాశ్రమాలకు చేయూత కూడా ఇస్తున్నారు. ఇక గో సేవ, యోగ శిక్షణ, వేద శాస్త్రాల పరిరక్షణతో పాటుగా ఆయుర్వేద, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణకి కూడా పాటుపడుతున్నారు. 


Also Read: Mahesh Babu wig: 'మహేష్ బాబు'ది విగ్గా.. కొత్త ఫొటోతో మళ్లీ చర్చలు మొదలు?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి