Shreya Ghoshal Pregnancy: తల్లి కాబోతున్నట్లు వెల్లడించిన సింగర్ శ్రేయా ఘోషల్, సంబరాలలో ఫ్యామిలీ
Singer Shreya Ghoshal Announces Pregnancy News | తాము తల్లిదండ్రులం కాబోతున్నామని శ్రేయా ఘోషల్, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ అధికారికంగా ప్రకటించారు. బేబీ బంప్ చూపిస్తూ శ్రేయా ఘోషల్, ముఖోపాధ్యాయ ఓ ఫొటో షేర్ చేశారు.
Singer Shreya Ghoshal Announces Pregnancy News | ఫేమస్ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తాను తల్లిని కాబోతుతున్నానని, తొలిసారి గర్భం దాల్చిన ప్రముఖ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు తన ఫ్యాన్స్, ఫాలోయర్లతో శుభవార్త షేర్ చేసుకున్నారు.
తాము తల్లిదండ్రులం కాబోతున్నామని శ్రేయా ఘోషల్, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ అధికారికంగా ప్రకటించారు. బేబీ బంప్ చూపిస్తూ శ్రేయా ఘోషల్, ముఖోపాధ్యాయ ఓ ఫొటో షేర్ చేశారు. ‘బేబీ శ్రేయాదిత్య ఆన్ ద వే.. నేను, శిలాదిత్య ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకునేందుకు చాలా సంతోషిస్తున్నాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకు అవసరమంటూ’ బాలీవుడ్(Bollywood) సింగర్ శ్రేయా ఘోషల్ పోస్టులో రాసుకొచ్చారు.
Also Read: Sathyameva Jayathe Song: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుంచి సత్యమేవ జయతే సాంగ్, మీరూ వీక్షించండి
శ్రేయా ఘోషల్ భర్త శిలాదిత్య సైతం చాలా సంతోషంగా ఉన్నారు. మా జీవితంలోకి మరో సంతోషం రాబోతోందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బాలీవుడ్, టాలీవుడ్ సహా పలు భాషలలో సింగర్ శ్రేయా ఘోషల్ నేపథ్యగాయనిగా ఎన్నో అద్బుతమైన పాటలకు గాత్రం అందించారు. శ్రేయా ఘోషల్ ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి బెస్ట్ సింగర్ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
Also Read: Also Read: Lamborghini Urus car: రూ. 5 కోట్లతో ఎవ్వరికీ లేని Luxury car book చేసిన Jr Ntr
కాగా, సింగర్ శ్రేయా ఘోషల్ వివాహం తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయతో జరిగింది. ఫిబ్రవరి 5, 2015లో బెంగాళీ సంప్రదాయంలో శ్రేయా ఘోషల్, శిలాదిత్యల వివాహం ఘనంగా నిర్వహించారు. తాజాగా తొలిసారి తాము తల్లిదండ్రుల కాబోతున్నామని ఈ జంట అధికారికంగా ప్రకటించడంతో బాలీవుడ్, ఇతర సినీ రంగాల ప్రముఖులు వారికి విషెస్ తెలుపుతున్నారు.
Also Read: Richa Gangopadhyay Pregnancy: తన అభిమానులకు శుభవార్త చెప్పిన మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook