Taapsee Pannu Residence In Mumbai Raided by IT Officials: ఆదాయపు పన్ను అధికారులు బాలీవుడ్ నటీనటులు, దర్శకనిర్మాతల ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ముంబైలోని ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్, నటి తాప్సీ పన్నూ, వికాస్ బహల్ ఇళ్లల్లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ప్రొడక్షన్ హౌస్ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన ఫాంటమ్ ఫిల్మ్స్ కంపెనీ నిర్వహిస్తోన్న అనురాగ్ కశ్యప్, దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే, నిర్మాత మధు మంతెనా, వికాస్ బహల్ ఆస్తులపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ప్రముఖులు నలుగురు కలిసి 2011లో ఫాంటమ్ ఫిల్మ్స్ స్థాపించారు. అయితే అనివార్య కారణాలతో ఈ సంస్థను 2018 అక్టోబర్‌లో మూసివేశారు. కానీ నేటి ఉదయం అనూహ్యంగా నటి తాప్సీ(Taapsee Pannu), అనురాగ్ కశ్యప్, వికాస్ బహల్, తదితర బాలీవుడ్ ప్రముఖుల ఆస్తులపై సోదాలు జరిగాయి.
Also Read: Prabhas: టాలీవుడ్‌కు దూరం కానున్న ప్రభాస్, ముంబైలోనే మకాం
పీటీఐ ప్రకారం.. ఆదాయపు పన్నుశాఖ అధికారులు వీరికి సంబంధించి ముంబై(Mumbai), పుణే నగరాల్లో సుమారు 20 ప్రాంతాల్లో వీరి ఆస్తులపై సోదాలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఫాంటమ్ ఫిల్మ్స్ యొక్క ఇతర ప్రమోటర్ల ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి. వికాస్ బహల్ సహా నటి తాప్సీ పన్నూ మరియు మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు ఆదాయపు పన్ను ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ తనిఖీలకు ఆదేశించింది.
Also Read: Lamborghini Urus car: రూ. 5 కోట్లతో ఎవ్వరికీ లేని Luxury car book చేసిన Jr Ntr !
Income Tax raids underway at the properties of film director Anurag Kashyap and actor Taapsee Pannu in Mumbai: Income Tax Department
— ANI (@ANI) March 3, 2021
కాగా, టాలీవుడ్(Tollywood) నుంచి బాలీవుడ్ బాట పట్టిన తాప్సీ అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే అత్యాచారం కేసులో నిందితుడు బాధితురాలిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడా అని సుప్రీంకోర్టు అడగటాన్ని ప్రశ్నించడంతో నటి తాప్సీ పన్ను ఇటీవల వార్తల్లో నిలిచింది. సింగర్ సోనా మోహపాత్రా వంటి మరికొందరు ఆమె ట్వీట్‌కు మద్దతుగా స్పందించారు. తాజాగా ఆస్తి పన్ను విషయంలో ఆమె సహా మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల ఆస్తులపై ఐటీశాఖ దాడులు నిర్వహించింది.
Also Read: Richa Gangopadhyay Pregnancy: తన అభిమానులకు శుభవార్త చెప్పిన మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook