Singer Sunitha Pre Wedding Party: టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత రెండో వివాహానికి (Singer Sunitha Second Marriage) సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్థం జరిగడం తెలిసిందే. రామ్ వీరపనేనితో ఏడడుగులు వేయనున్నారు సింగర్ సునీత. ఈ క్రమంలో శనివారం (డిసెంబర్ 26న) సాయంత్రం సింగర్ సునీత, రామ్ వీరపనేనిల ప్రీ వెడ్డింగ్ పార్టీ ఘనంగా జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తమ సన్నిహితులు, స్నేహితుల కోసం వివాహ వేడుకకు కొన్ని రోజుల ముందు సింగర్ సునీత (Singer Sunitha), రామ్ ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌లో సునీత ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఆమెకు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. వాస్తవానికి గత కొన్నేళ్ల నుంచి సింగర్ సునీత పెళ్లి వదంతులు వస్తూనే ఉన్నాయి. తాజాగా రెండో వివాహం చేసుకునేందుకు సునీత నిర్ణయం తీసుకున్నారు.


Gallery: Singer Sunitha Engagement Photos: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ గ్యాలరీ

కుటుంబసభ్యులు, ముఖ్యంగా కుమారుడు, కుమార్తె సహకారంతో Tollywood సింగర్ సునీత రెండో వివాహానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి ప్రీ వెడ్డింగ్ పార్టీకి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు హాజరై కాబోయే దంపతులు సునీత, రామ్ వీరపనేనిలను ఆశీర్వదించారు. అడ్వాన్స్‌గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Gallery: ​Ananya Pandey Photos: నటి అనన్య పాండే లేత సోయగాలు



కాగా, ఇరు కుటుంబసభ్యుల సమయంలో సింగర్ సునీత నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. తన నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసుకుంటూ మరోసారి వివాహం చేసుకోబోతున్నట్లుగా ఆమె పోస్ట్ చేశారు. తమ వ్యక్తిగత విషయాలను అంతగా టచ్ చేయవద్దని కోరుతూనే పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని సున్నితంగా ప్రకటించారు. ఆపై సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ (Singer Sunitha Engagement Photos) వైరల్‌గా మారాయి.


Gallery: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook