Tollywood Hero Megastar Chiranjeevi reacts on Lyricist Sirivennela Seetharama Sastry death: తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణించిన విషయం తెలిసిందే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Seetharama Sastry) మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హీరో చిరంజీవి కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి, సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరివెన్నెల మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇక ఇవాళ సాహిత్యానికి చీకటి రోజు అని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మెగాస్టార్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు. మళ్లీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి వస్తాడని అనుకున్నానని చిరంజీవి (Megastar Chiranjeevi) కన్నీరు పెట్టుకున్నారు.సీతారామశాస్త్రి హాస్పిటల్‌లో చేరే ముందు ఆయనతో మాట్లాడానని చెప్పారు. సిరివెన్నెల ఆరోగ్యం బాగోలేదని తెలిశాక.. చెన్నైలో (Chennai) ఓ మంచి హాస్పిటల్‌ ఉందని.. అక్కడకు ఇద్దరం కలిసి వెళ్దామని సిరివెన్నెలకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటానని.. నెలాఖరులోపు వచ్చేస్తాను అని సిరివెన్నెల (Sirivennela) తనతో చెప్పాడని చిరంజీవి పేర్కొన్నారు. 


ఇక్కడ ట్రీట్‌మెంట్ తీసుకున్నాక కూడా మళ్లీ ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి వస్తే నువ్వు చెప్పినట్టుగానే చెన్నై వెళ్దామని చెప్పి వెళ్లిన సిరివెన్నెల ఇవాళ ఇలా జీవం లేకుండా వస్తారని ఊహించలేదని కన్నీరు పెట్టుకున్నారు చిరంజీవి. ఆయనకు ఫోన్‌ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారని మెగాస్టార్ (Megastar Chiranjeevi) పేర్కొన్నారు. దాదాపు 20 నిమిషాలు ఎంతో ఉత్సాహంగా మాట్లాడటంతో సిరివెన్నెలకు ఏం జరగదు అనుకున్నానని చిరంజీవి చెప్పారు. తనను ఆప్యాయంగా మిత్రమా అని పిలిచేవారని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు.


Also Read :సిరివెన్నెలకు నచ్చిన ఆ రెండు పుస్తకాలు, కష్టమైన పాట ఏంటో తెలుసా


వేటూరి (Veturi) తర్వాత అంత గొప్ప రచయిత సిరివెన్నెల అని చిరంజీవి పేర్కొన్నారు. సిరివెన్నెలకు 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించిన రోజు తాను వారి ఇంట్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు చిరంజీవి. భౌతికంగా సిరివెన్నెల (Sirivennela) దూరమైనా.. తన పాటలతో ఆయన ఇంకా మన మధ్యే బతికే ఉన్నారని చిరంజీవి పేర్కొన్నారు.


Also Read :Sirivennela: చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఎలా మారారు?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook