Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు `సీతారామం`.. టాక్ ఎలా ఉందంటే?
Dulquer Salmaan, MrunalThakur`s Sita Ramam movie Review. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన `సీతారామం` సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Dulquer Salmaan, MrunalThakur and Rashmika Mandannas Sita Ramam movie Twitter: అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమ గాధ, పడిపడిలేచే మనసు లాంటి అందమైన ప్రేమ కథా చిత్రాలను తెరక్కెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు హను రాఘవపూడి. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో ప్రేమకథ 'సీతారామం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు.
సీతారామం సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాను పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించడంతో.. సీతారామంపై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈరోజు (ఆగస్ట్ 5) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో షోస్ పడగా.. మనదగ్గర ప్రీమియర్స్ షో చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇస్తున్నారు. సినిమా ఎలా ఉందనే విషయంపై తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
'సీతారామం సినిమా క్లాసిక్ లవ్ డ్రామా' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'చాలా రోజుల తర్వాత అందమైన ప్రేమ కథ సినిమా చూశాం' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'సీతారామం సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్', 'విజువల్స్ , టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతం' , 'ఫస్టాప్ బాగుంది.. సెకండాఫ్ సూపర్', 'ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉంది.. సెకండాఫ్ అద్భుతంగా ఉంది', 'మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగుంది' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
మొత్తానికి సీతారామం సినిమాకు పాసిటివ్ టాక్ వస్తోంది. దాంతో సినిమా భారీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్ పడినట్టే. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషించారు. హీరో సుమంత్, సీనియర్ నటి భూమిక, దర్శకుడు గౌతమ్ మీనన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read: Gold Price Today August 5: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవే!
Also Read: Varalakshmi Vratam 2022: ఇవాళ వరలక్ష్మీ వ్రతం.. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, పుష్పాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook