Varalakshmi Vratam 2022: ఇవాళ వరలక్ష్మీ వ్రతం.. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, పుష్పాలు ఇవే..

Varalakshmi Vratam 2022: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఆ తల్లి అనుగ్రహం పొందవచ్చు.. ఏ పుష్పాలు సమర్పిస్తే ఆ అమ్మవారి కృప మీపై ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 12:10 PM IST
  • ఇవాళ వరలక్ష్మీ వ్రతం
  • వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలివే
  • ఏయే నైవేద్యాలు సమర్పించాలంటే
Varalakshmi Vratam 2022: ఇవాళ వరలక్ష్మీ వ్రతం.. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, పుష్పాలు ఇవే..

Varalakshmi Vratam 2022: ఇవాళ వరలక్ష్మీ వ్రతం. హిందువులు ప్రతీ ఏటా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున వివాహిత స్త్రీలు ఉపవాస దీక్ష ఉండి లక్ష్మీ దేవిని పూజిస్తారు. వరలక్ష్మీ అంటే మహాలక్ష్మీ రూపమే. ఆ మహాలక్ష్మీ అనుగ్రహంతో అష్టఐశ్వర్యాలు పొందుతారని నమ్ముతారు. వరలక్ష్మీ వ్రతం రోజున ఏ రకమైన నైవేద్యాలు సమర్పిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం... 

అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు :

ఆవు పాలతో బెల్లం, నెయ్యి, జీడిపప్పు కలగలిపి చేసిన పాయసం
శనిగపప్పు, బెల్లం కలిపి చేసిన పూర్ణాలు
పులిహోర

బెల్లంతో చేసిన చక్కర పొంగలి
దద్దోజనం
అరటిపండు, కొబ్బరికాయ, దానిమ్మ పండ్లు

భక్తి భావం ప్రధానం :

కొంతమంది అమ్మవారికి 9 నైవేద్యాలు సమర్పిస్తారు. కొందరు ఒక నైవేద్యం మాత్రమే సమర్పించవచ్చు. ఎవరి శక్తి మేరకు వారు నైవేద్య సమర్పణ చేస్తారు. ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టామనే దాని కన్నా భక్తి భావం ప్రధానమైనది. మీ శక్తి మేరకు కొంత చేసినా.. అది అమ్మవారి కోసం ఇష్టంగా చేస్తే ఆ తల్లి అనుగ్రహం మీకు కలుగుతుంది.

అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు :

వరలక్ష్మీ అమ్మవారికి ఏ పూలతో పూజ చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే తామర పుష్పాలు, పసుపు ఛామంతులు, ఎర్ర గులాబీలు, ఎర్ర మందారాలు, గన్నేరు పూలు, మల్లెలు, జాజులు.. ఇలా సుగంధభరితమైన పూలన్నీ అమ్మవారికి చాలా ప్రతీపాత్రమైనవి.

పూజా ముహూర్తం :

సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 6.14 గం. నుంచి 8.14 గం.వరకు. వృశ్చిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం 1.07 గం. నుంచి 3.25 గం. వరకు, కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 7.12 గం. నుంచి 8.39 గం. వరకు. 

Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Also Read: Horoscope Today August 5th : నేటి రాశి ఫలాలు.. రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ రాశి వారు మోసపోయే ప్రమాదం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్‌ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News