నటీనటులు: శివ కార్తికేయన్, సాయి పల్లవి, రాహుల్ బోస్, భువన్ అరోరా  తదితరులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎడిటర్: కలైవానన్


సినిమాటోగ్రఫీ: సి.హెచ్. సాయి


సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్


నిర్మాత : కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్


దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియాస్వామి


శివకార్తికేయన్, సాయి పల్లవి హీరోహీరోయిన్సగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అమరన్. ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ ముకుంద్‌ వరద రాజన్‌ జీవిత చరిత్రకు మేకర్స్ తెర రూపం ఇచ్చారు. కమల్ హాసన్, R.మహేంద్రన్ నిర్మించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడం.. ప్రమోషన్స్ భారీగా చేయడంతో తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నేడు (అక్టోబర్‌ 31) థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. మరి అమరన్ అంచనాలను అందుకుందా..? శివ కార్తీకేయన్ ఖాతాలో హిట్ పడిందా..? మూవీ రివ్యూలో చూద్దాం పదండి.


కథ ఏంటి..?


మాతృభూమి కోసం పోరాడుతూ వీరమరణం పొందిన ఇండియన్‌ ఆర్మీ మేజర్ ముకుంద్‌ వరద రాజన్‌ పాత్రను శివ కార్తికేయన్ నటించగా.. ఆయన భార్య  ఇందు రెబక్క వర్గీస్‌ పాత్రలో సాయి పల్లవి యాక్ట్ చేశారు. 2014లో జమ్ము కశ్మీర్‌లో  ఓ గ్రామలో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ ముకుంద్ వరద రాజన్ వీరమరణం పొందారు. ప్రపంచానికి ఆయన ఓ వీరసైనికుడిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఆర్మీలోకి ఎలా వచ్చారు..? ఇందు రెబక్క వర్గీస్‌తో పరిచయం ఎలా ఏర్పడింది..? వారిద్దరు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు..? రాష్ట్రీ రైఫిల్స్‌లో మేజర్‌గా ఆయన ఎలాంటి ఆపరేషన్లు చేపట్టారు..? ఉగ్రవాదులను ఎలా హతమార్చారు..? దేశ రక్షణలో తన ప్రాణాలు ఎలా త్యాగం చేశారు..? వంటి విషయాలను తెరపై చూడాల్సిందే.


విశ్లేషణ:


నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు తెర రూపం ఇవ్వడం కత్తి మీద సామే. అందులోనూ దేశ కోసం వీర మరణం పొందిన ఆర్మీ మేజర్ బయోపిక్ అంటే ఓ పెద్ద సవాల్. కథలో సోల్ మిస్ అవ్వకుండా ఆసక్తికరంగా మలిస్తే ఆడియన్స్ నుంచి కచ్చితంగా అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది. సైనికుడి జీవిత చరిత్ర అంటే యుద్ధాలు, ఆపరేషన్లు, ఇతర సన్నివేశాలను తెరకెక్కించడం గతంలో చూశాం. కానీ అమరన్ మూవీలో ముకుంద్ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించారు. ముకుంద్, ఇందు భార్యాభర్తల మధ్య భావోద్వేగాల నడుమ కథ ఆద్యాంతం ఎమోషనల్‌గా సాగుతుంది. ఇద్దరు ప్రేమించుకోవడం.. కలిసి ప్రయాణించడం.. ఆర్మీ ఉద్యోగం రావడంతో దూరంగా ఉండాల్సి రావడం.. పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకునే వరకు సాగే సన్నివేశాలు ఆకట్టుకునేలా తెరకెక్కించారు.


దేశం కోసం కుటుంబాలకు దూరంగా ఉండే సైనికుల వ్యక్తిగత మనోభావాలను ప్రతిబింబిచేలా దృశ్యాలు కదిలిస్తాయి. సైనికుల కుటుంబాలు ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంటాయి..? సైనికులు తమ కుటుంబాల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తారు..? వంటికి సినిమాకు కీలకం. ముఖ్యంగా ముకుంద్‌, ఇందు మ‌ధ్య స‌న్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. వ్యక్తిగత జీవితాన్ని చూపిస్తునే.. వృత్తి జీవితాన్ని ఎంతో సహజంగా చూపించారు. ఆర్మీ ఆపరేషన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. కశ్మీర్‌లో ఎలాంటి పరిస్థితుల్లో మన సైనికులు ఉంటారు..? ఉగ్రవాదులు, వాళ్లకు సహకరించే వారు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి..? ఆర్మీ ఆపరేషన్లు ఎలా సాగుతాయి..? వంటి సీన్లు గత సినిమాల కంటే డిఫరెంట్‌గా తెరకెక్కించారు. ఫస్టాఫ్‌లో ముకుంద్-ఇందు లవ్ స్టోరీ, కుటుంబాల నేపథ్యం, మేజర్ స్థాయికి ముకుంద్ ఎలా ఎదిగారు..? అనేది గొప్పగా చూపించారు. సెకండాఫ్‌లో ఉగ్రవాదులను అంతం చేసేందుకు ముకుంద్ చేపట్టిన ఆపరేషన్లు చూపించారు. బలమైన భావోద్వేగాల నడుమ అందమైన ప్రేమ కథ, దేశ భక్తిని రగిలించే ఓ వీర సైనికుడి ప్రయాణం ఓ గొప్ప సినిమాను చూసిన అనుభూతిని కల్పిస్తుంది.


ఎవరు ఎలా నటించారు..?


ఇప్పటివరకు శివ కార్తికేయన్‌ను ఎక్కవగా స‌ర‌దా పాత్ర‌ల్లోనే చూశాం. కానీ అమరన్‌లో పూర్తిగా భిన్నమైన పాత్ర పోషించారు. తనలోని సరికొత్త నటుడిని పరిచయం చేశారు. రెండు కోణాల్లో సాగే పాత్రను అద్భుతంగా పోషించారు. ప్రేమికుడిగా.. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే సైనికుడిగా శివ కార్తికేయన్ నటన ఆకట్టుకుంటుంది. సాయి పల్లవితో కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ముకుంద్ భార్య ఇందుగా సాయి పల్లవి జీవించేసింది. వీరిద్దరి నటన సినిమాకు ప్రాణం పోసింది. ముకుంద్ త‌ల్లి పాత్ర‌లో గీతా కైలాసం కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పూయించారు. ప్రతి ఒక్క నటుడు తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు. జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయింది. బీజీఎంతో మరో స్థాయిలో నిలబెట్టాడు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటింగ్‌ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగినట్లు ఉన్నాయి.


-రేటింగ్‌: 3.5/5


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter