Sonu Sood: కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అందరికీ చేరువైన ఒకే ఒక వ్యక్తి సోనూసూద్. కరోనా కష్టకాలంలో రీల్ హీరో కాదు..రియల్ హీరో అన్పించుకున్నాడు. ఇప్పుడు రీల్ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్టు సిద్ధమైందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోనూసూద్ (Sonu sood) అనగానే..మొన్నటివరకూ అంటే కరోనాకు ముందు వరకూ రీల్ లైఫ్‌లో ఓ విలన్ పాత్రధారి. బాలీవుడ్( Bollywood)నటుడిగానే అయినా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పేరు. అయితే కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రీల్‌లైఫ్‌లో హీరో కాకపోయినా..రియల్ లైఫ్‌లో హీరో అయిపోయాడు. అది కూడా దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు సుపరిచితమే కాదు మార్మోగిపోయింది. ఆపదలో ఉన్నవారిని దేవుడిలా ఆదుకుంటూ ఆపద్భాంధవుడిలా నిలిచాడు. ఆస్థుల్ని తాకట్టు పెట్టి మరీ సేవల్ని కొనసాగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.


ఇప్పుడు రీల్‌లైఫ్‌లో కూడా హీరోగా కన్పించనున్నాడు అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు(Pan India Movie)లో. ఔను నిజమే. సోనూసూద్ అభిమానులు ఆనందపడే వార్తే ఇది. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న పాన్ ఇండియా మూవీలో సోనూసూద్ హీరోగా కన్పించనున్నాడు. సోనూసూద్ కోసం క్రిష్ ఇప్పటికే ఓ కథ సిద్ధం చేశాడని..సోనూసూద్ కూడా ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్..పవన్ కళ్యాణ్‌తో(Pawan kalyan) హరిహర వీలమల్లు సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తవగానే..సోనూసూద్ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నాడట.


Also read: Nayanthara Trolls: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నయనతారపై నెటిజన్ల ట్రోలింగ్, అసలు విషయం ఏంటంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook