Sourav Ganguly Biopic: గత కొంత కాలంగా బయోపిక్ల్ ట్రెండ్ నడుస్తోంది. క్రీడాకారులు, సినీ నటులు జీవితకథల ఆధారంగా తీసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఎం.ఎస్. ధోని బయోపిక్ 'ఎం.ఎస్. ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ', అథ్లెట్ మిల్కా సింగ్ బయోపిక్ 'భాగ్ మిల్కా భాగ్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా మరో క్రీడాకారుడి జీవితకథ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ బయోపిక్(Sourav Ganguly Biopic)ను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో టైటిల్‌ రోల్‌ను బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా(Ayushmann Khurrana) పోషించబోతున్నారు. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించనున్నారు. డిసెంబర్‌లో ఈ సెట్స్ పైకి వెళ్లనుంది. గంగూలీ పాత్రలో రణబీర్ కపూర్ నటించనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.


ఈ సినిమా కోసం ఆయుష్మాన్‌ ఖురానా రెండు నెలల పాటు క్రికెట్‌ కోచింగ్‌ కూడా తీసుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. స్వతహాగా లెఫ్ట్‌హ్యాండెడ్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన ఆయుష్మాన్‌ ఖురానా.. గంగూలీ తరహా క్రికెటింగ్‌ షాట్స్‌ను ఆడేందుకు సాధన చేయనున్నాడు. ఈ సినిమా విషయంలో మూవీటీమ్ దాదా అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లవ్‌ రంజన్‌, అంకుర్‌ గార్గ్‌ నిర్మించబోతున్నారు.


భారత క్రికెట్‌లో విజయవంతమైన సారథిగా గంగూలీకి పేరుంది. ఇతడు కెప్టెన్ గా ఉన్న హయాంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. తన కెప్టెన్సీతోపాటు ఆటతో కూడా అభిమానుల మదిలో చెరగని ముద్ర వేశాడు. ఇతడి సారథ్యంలోనే టీమిండియా 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. తన వన్డే కెరీర్ లో 11363 పరుగులు చేశాడు దాదా. భారత ప్రభుత్వం గంగూలీని 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈయన భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి డోనా గంగూలీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సనా అనే కుమార్తె ఉంది.


ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్ గర్ల్ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇందులో ఇతడు చేసిన పూజ పాత్రకు మాంచి రెస్పాన్స్ వస్తుంది. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండేతో పాటు అను కపూర్, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్, పరేష్ రావల్ మరియు అభిషేక్ బెనర్జీ తదితరులు కీ రోల్స్ చేశారు.


Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఛాన్స్.. ఇలా చేస్తే లైవ్ లో షో చూడొచ్చు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి