Special Premieres Became new Tactic in Tollywood: ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది చూడకుండా సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి చిన్న సినిమాలు ఈ మధ్య సూపర్ హిట్ లుగా నిలిచాయి. అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఒక కొత్త సెంటిమెంట్ కూడా సినీ నిర్మాతలు ఫాలో అవుతున్నారు. అసలు విషయం ఏమిటంటే గత ఏడాది అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా విడుదల చేసే కంటే ముందు రోజు రాత్రి కొన్ని మేజర్ సిటీస్ లో అలాగే పట్టణాల్లో సెలెక్ట్ చేసిన థియేటర్లలో ప్రీమియర్ షోలుగా ప్రదర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ రోజు పెయిడ్ ప్రీమియర్ షోలకి వచ్చిన మౌత్ టాక్ కారణంగా తర్వాత రోజు నుంచి సినిమా హాల్స్ హౌస్ ఫుల్ గా ఉండటమే కాక మరింత మందిని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశాయి. ఇక ఇటీవల విడుదలైన రైటర్ పద్మభూషణ్ సినిమాకి కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఈ సినిమాని కూడా కొన్ని సెలెక్ట్ చేసిన ధియేటర్లలో ముందు రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడంతో మంచి మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం కారణంగా తర్వాతి రోజు నుంచి ధియేటర్లకు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇదే కోవలో పయనించాలని సార్ మూవీ యూనిట్ నిర్ణయం తీసుకుంది.


ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం సార్ ఈ సినిమాని తమిళంలో వాతి పేరుతో తెలుగులో సార్ పేరుతో ఏకకాలంలో తెరకెక్కించారు, ఏక కాలంలో విడుదల చేస్తున్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా వాస్తవానికి ఫిబ్రవరి 17వ తేదీ అంటే రేపు విడుదల కావాల్సి ఉంది.


కానీ ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో సినిమా యూనిట్ ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో పలు సెలెక్ట్ చేసిన థియేటర్లలో ముందుగానే విడుదల చేస్తోంది. హైదరాబాదులో 45 థియేటర్లలో ఈ సినిమాని ప్రదర్శిస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు.  గతంలో రెండు సినిమాలకు ఎలా అయితే మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయ్యిందో అది తమ సినిమాలకు ప్లస్ అయిందో ఈసారి కూడా అలాగే ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Heroes OTT Release: ఓటీటీల మీద కన్నేస్తున్న తెలుగు హీరోలు.. చిరు టు రామ్ చరణ్ ఎవరూ వదలట్లేదు!


Also Read:  Telugu OTT Releases This Week: సుడిగాలి సుధీర్ గాలోడు సహా ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook