Sree Leela  First Look From Dhamaka: మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా త్రినాథ రావు నక్కిన తెరకెక్కిస్తున్న సినిమా 'ధమాకా' (Dhamaka). 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం పుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇది వరకే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో రవితేజకు జోడీగా పెళ్లిసందడి ఫేమ్ 'శ్రీలీల' నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ((Sree Leela  First Look From Dhamaka) రిలీజ్ చేశారు మేకర్స్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోస్టర్ చూస్తుంటే... ప్రణవి పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె పక్కన రవితేజ కూర్చున్నారు. ఇద్దరూ ఏదో ఒక విషయం గురించి సీరియస్ గా చర్చించుకుంటున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ పిక్ లో టీ-షర్ట్, జీన్స్‌లో శ్రీలీల (Sree Leela) అందంగా కనిపిస్తోంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నారు. ఇటీవల 'ఖిలాడీ' (Khiladi) మూవీతో ప్రేక్షకుల మందుకొచ్చారు రవితేజ. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. 





 


Also Read: F3 New Release Date: 'ఎఫ్‌3' కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్... ఎప్పుడంటే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి