Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల అవుట్.. లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి ఇన్?
Sreeleela: వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కి ఈ మధ్య విడుదలైన ఖుషి సినిమా పరవాలేదు అనిపించుకుంది. కానీ ఒక సూపర్ హిట్ అందుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు ఈ హీరో. ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ తదుపరి ప్రాజెక్టుల పైన పెట్టుకోనున్నారు..
Tripti Dimri: పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో వరస సూపర్ హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు విజయ్ కెరియర్ లోనే డిజాస్టర్లగా మిగిలాయి. ఈ సినిమాల తరువాత ఈమధ్య విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన ఖుషి సినిమా మాత్రం విజయ్ కి కొంచెం ఊరట కలిగించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది. అయితే ఆ సినిమా హిట్ క్రెడిట్ మాత్రం సమంత క్రెడిట్లోకి వెళ్లి చేరింది. దీంతో ప్రస్తుతం తన ఆశలన్నీ తదుపరి ప్రాజెక్టులపైనే పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం ఈ హీరో తనకి గీత గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మే నెల చివరలో విడుదల కావచ్చు. ఈ చిత్రంలో రష్మిక మందాన స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఇవ్వనుంది అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్టు తరువాత ఈ హీరో నాని జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తో ఒక సినిమా చేయనున్నారు.ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో శ్రీలీల నటిస్తుండగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా పూజ కార్యక్రమాలు పని షూటింగ్ పనులు కూడా మొదలుపెట్టేశారు.
షూటింగ్ కూడా కొంత శాతం జరిగిందని సమాచారం. కానీ ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీ లీల తప్పుకుందని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శ్రీలీల ఇచ్చిన డేట్స్ ప్రకారం ఈ చిత్రంలో ఆల్రెడీ శ్రీలీల ఇప్పటికే పాల్గొంటూ ఉండాలి. కానీ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉంది ఈ గౌతమ్ చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేస్తూ ఉన్నారట. ప్రస్తుతం శ్రీలీల వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడం, MBBS చివరి దశలో ఉండటంతో పోస్ట్ పోన్ అయినా విజయ్ సినిమాకి శ్రీ లీల డేట్స్ అడ్జస్ట్ చేయడం జరగకపోవచ్చు అని సమాచారం.
ఇక దీంతో ప్రస్తుత సెన్సేషన్ శ్రీలీలని పక్కన పెట్టి మరో లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ ని తీసుకున్నారని తెలుస్తుంది. ఆ హీరోయిన్ యానిమల్ సినిమా భామ త్రిప్తి దిమ్రి అని సమాచారం. యానిమల్ సినిమాతో ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఆ చిత్రంలో రష్మిక కన్నా కూడా ఈమే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిప్తిని విజయ్ సినిమాకి తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
మరి ఈ వార్తలో నిజమేంటో తెలియాలి అంటే.. సినిమా యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాలి.
Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ
Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter