Sreeleela Viral Video: శ్రీలీలా టాలీవుడ్ బ్యూటీ తెలుగులో మాత్రమే కాదు కన్నడ సినిమాలో కూడా నటించారు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. మొదట ఆమె కన్నడ సినిమాలో నటించారు. ఆ తర్వాత 'పెళ్లి సందD' సినిమా హీరో శ్రీకాంత్ కొడుకు రోహన్ తో కలిసి నటించారు. తెలుగులో తన మొదటి సినిమాలోనే ఎందరో దృష్టిని ఆకట్టుకుంది శ్రీలీలా. ఈ సినిమాలో తన చిలిపి నటన మాత్రమే కాదు క్రేజీ డ్యాన్స్‌ కూడా చేసింది. అందులో రాఘవేంద్రరావు హీరోయిన్‌ జాబితాలో చోటు. వెరసి కొన్ని బడా సినిమాలు ధమాకా, భగవంత్‌ కేసరి వంటి సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టాలీవుడ్ యంగెస్ట్‌ హీరోయిన్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. ఇక పుష్ప2 సినిమ 'కిస్సిక్' సాంగ్ తో ఈమె ఫ్యాన్స్ జాబితాలో మరింత మంది చేరిపోయారు. ఈమె నటనకు సైమా అవార్డు కూడా వరించింది. ఈ బ్యూటీ 2022లో 'బై టు లవ్' కన్నడ రొమాంటిక్ కామెడీ సినిమాలో కూడా నటించారు. మొదట రాఘవేంద్రరావు నిర్మించిన 'పెళ్లి సందD' సినిమాతో శ్రీలీలకు ఆఫర్లు క్యూ కట్టాయి. వెంటనే రవితేజ, బాలకృష్ణ వంటి బడా హీరోల సినిమాలో కూడా నటించింది. ఇక హీరో రామ్‌ పోతినేనితో 'స్కంద' సినిమాలో కూడా నటించింది.


శ్రీలీలకు ఫిలింఫేర్ అవార్డు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా కూడా దక్కించుకుంది. ఇక మహేష్ బాబు తో కలిసి 'గుంటూరు కారం' సినిమాలో నటించిన ఈమె 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ లో డాన్స్ అదరగొట్టింది. ఈ సాంగ్ రికార్డులను బద్దలు కొట్టింది.


ఇదీ చదవండి: శోభిత నాగచైతన్యల న్యూఇయర్‌ సెలెబ్రేషన్స్‌ ఎక్కడో తెలుసా?  


శ్రీలీలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తను చేసిన మరో డ్యాన్స్‌ వీడియో షేర్‌ చేసింది. ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో ఆమె మెరిసే బ్లౌస్ ధరించి కారులో ఎంతో హ్యాపీగా కనిపిస్తుంది . క్యూట్ గా కనిపిస్తున్న శ్రీలీల వీడియో చూసి నెట్టింటా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.



 


మరీ ముఖ్యంగా ఈ వీడియో చూసిన శ్రీ లీల ఏంటి లీలా? అని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో శ్రీలీల పార్టీ మూడ్ లో హ్యాపీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. డాన్స్ చేస్తూ కారులో రకరకాల ఫోటో ఫోజులను ఇచ్చింది. ఫ్యాన్స్ ని ఫిధా చేస్తుంది. ఇది చూసిన చాలా మంది శ్రీ లీల ఎంత క్యూట్ గా ఉంది? నాటిగా ఉంది అని మరికొందరు ఏంటి పాప పార్టీలో రచ్చరంబోలో చేసావా? ఫుల్ గా తాగేసావా? అని కామెడీ కామెంట్లు పెడుతున్నారు..


ఇదీ చదవండి: ఆధార్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. ఈ కొత్త బెనిఫిట్స్‌‌ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter