Sri Vishnu: `ఓం భీమ్ బుష్` తర్వాత మరో డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీతో పలకరించనున్న శ్రీ విష్ణు..
Sri Vishnu: శ్రీ విష్ణు తెలుగులో వైవిధ్యమైన కథలతో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ `సామాజవరగమన` మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఇతను.. తాజాగా `ఓం భీమ్ బుష్` మూవీతో పలకరించాడు.
Sri Vishnu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన చిత్రాలతో ఆడియన్స్‌ను ఎంటర్టేన్ చేస్తోన్న హీరోగా శ్రీ విష్ణు. లాస్ట్ ఇయర్ సామజవరగమన, రీసెంట్‌గా ఓం భీమ్ బుష్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నాడు. ఇపుడు హాట్రిక్ హిట్ పై కన్నేసాడు. ఈ నేపథ్యంలో ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై శ్రీరామ నవమి సందర్భంగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
‘సామజవరగమన’ చిత్రంలో శ్రీవిష్ణుకి జంటగా నటించిన రెబా జాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైయింది. మేకర్స్ వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వీర్ ఆర్యన్, అయ్యప్ప శర్మ, సుదర్శన్, రచ్చ రవి తదితరులు లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసారు.
హీరో శ్రీవిష్ణు కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా పూర్తి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కుతోంది. విద్యాసాగర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా గా వ్యవహరిస్తున్నారు. మనీషా ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. శ్రీ విష్ణు విషయానికొస్తే.. రీసెంట్‌గా ఈయన హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read More: Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఒక అక్క కూడా ఉంది.. ఆమె గొప్పతనం ఏంటో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter