Facts About Sridevi's Marriage: ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్‌ల జాబితాల్లో శ్రీదేవీ ముందు వరుసలో ఉంటుంది. సౌత్, నార్త్‌లో శ్రీదేవీకి లెక్కలేనంత ఫాలోయింగ్ ఉంది. ఆమె నటించని హీరోలు ఎవ్వరూ లేరు. అమితాబ్ బచ్చన్ నుంచి మొదలుకొని రజినీ, కమల్, చిరు ఇలా అందరితోనూ జోడి కట్టేసింది. ఆమెకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అయితే శ్రీదేవీ పెళ్లి విషయంలో మాత్రం ఆమె తల్లి ఎక్కువగా ఆలోచనలు పెట్టుకునేదట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీదేవీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి ఆమె తల్లి సెట్స్‌కు వస్తుండేది. అలా శ్రీదేవీ సినీ ప్రయాణంలో ఆమె తల్లి పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అయితే శ్రీదేవీ పెళ్లి విషయంలో మాత్రం ఆమె తల్లి కొందరి ముందు ప్రపోజల్స్ పెట్టిందని తెలుస్తోంది. కమల్ హాసన్ తాజాగా ఓ విషయాన్ని వెల్లడించాడు. శ్రీదేవీని పెళ్లి చేసుకోమని అడిగిందట. అప్పుడు కమల్ హాసన్ వింత సమాధానం ఇచ్చాడట.


తామిద్దరం పెళ్లి చేసుకుంటే.. భరించలేరని, రోజూ మీ కూతురు మీ ఇంటికి వచ్చేస్తుంటుందని సరదాగా వ్యాఖ్యానించాడట. అయితే కమల్ హాసన్‌ మాత్రమే కాకుండా జేడీ చక్రవర్తి, రాజశేఖర్ వంటి వారిని కూడా శ్రీదేవి తల్లి అడిగిందట. శ్రీదేవీని పెళ్లి చేసుకోమని రాజశేఖర్, చక్రవర్తిలను కూడా ఆమె తల్లి అడిగిందని తెలుస్తోంది.


రాజశేఖర్ ఫ్యామిలీ, శ్రీదేవీ ఫ్యామిలీకి రిలేషన్ ఉందట. రాజశేఖర్ డాక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఓ సారి రాజశేఖర్‌ను శ్రీదేవీ తల్లి నేరుగా అడిగేసిందట. నా కూతుర్ని పెళ్లి చేసుకో అని రాజశేఖర్‌ను శ్రీదేవీ తల్లి అడిగేసిందట. ఇక జేడీ చక్రవర్తిని సైతం ఇలానే అడిగిందని ఆ హీరో స్వయంగా చెప్పుకొచ్చాడు. చిరవకు శ్రీదేవీ మాత్రం బోనీ కపూర్ సొంతమైంది. శ్రీదేవి దుబాయ్‌లో పెళ్లికి వెళ్లి.. అక్కడే హోటల్‌ బాత్రూంలో పడి మరణించిన సంగతి తెలిసిందే. ఇక శ్రీదేవీ మరణం పట్ల కూడా ఎన్నో కాంట్రవర్సీలు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే.


Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?


Also Read: Ritika Nayak Pics : లోపల ఏమీ వేసుకోకుండా రితికా నాయక్ రచ్చ.. రెచ్చిపోయిన విశ్వక్ సేన్ బ్యూటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook