Mahesh Babu - Rajamouli -SSMB29: దర్శక బాహుబలి రాజమౌళి,  సూపర్ స్టార్  మహేష్ బాబు కలయికలో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎపుడు స్టార్ట్ అవుతుందా అని కూడా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో ప్రత్యేకంగా ట్రెయిన్ కూడా అవుతున్నాడు. జుట్టు పెంచి పూర్తిగా మేకోవర్ అయ్యాడు. తాజాగా ఈ సినిమా పై రాజమౌళి తండ్రి ప్రముఖ రచయత కమ్ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళుతుంది. ఆల్రెడీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. సెట్స్ నిర్మాణాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే లొకేషన్స్ వేట కూడా పూర్తయిందన్నారు. షూటింగ్ కోసం అన్ని పర్మిషన్స్ కూడా వచ్చాయన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా కథను రాయడానికి రెండేళ్లు  పట్టిందని ‘మాస్టర్ క్లాస్ బై విజయేంద్ర ప్రసాద్’ పాల్గొన్న ఈయన రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా పూర్తి అడ్వెంచరస్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు భారతీయ తెరపై రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా రాజమౌళిఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు చెప్పుకొచ్చారు.


ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ కూడా మార్చుకున్నాడు. పూర్తిగా గడ్డంతో పెరిగిన జుట్టుతో కేక పుట్టిస్తోంది. భారతీయ, ఇంటర్నేషనల్ నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన దేవర ఫేమ్ జాన్వీ కపూర్ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు నాగార్జున ఈ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేయడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమా రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.  ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ అనే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్టోరీతో పాటు స్రీన్ ప్లే, డైలాగ్స్ వెర్షన్స్, సినిమాలో స్కెచెస్ కూడా పూర్తి చేసారు. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. విక్రమార్కుడు, బాహుబలి తరహాలో ఈ సినిమాలో రాజమౌళి డ్యూయల్ రోల్లో తెరకెక్కించాడు. ఇపుడు మహేష్ బాబును రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. తెలుగులో ఇప్పటి వరకు  ఏ హీరో చేయనటువంటి డిఫరెంట్ రోల్ చేయబోతన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter