Jayasudha: సీనియర్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సహజ నటి గా పేరు కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు సినిమాలలో బిజీగా ఉన్న ఈమె ఈమధ్య రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రాజకీయాలలో కూడా దూసుకుపోతున్న జయసుధ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించినట్లు ఒక వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


అసలు విషయంలోకెళితే.. తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో పలువురు మంత్రులు, ముఖ్యమంత్రులు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని పట్టించుకోకుండా జయసుధ అవమానపరిచినట్లు తెలుస్తోంది..


అసలు విషయంలోకి వెళ్తే.. సీఎం పక్కనే ఉన్న వారిని నమస్కరించింది. కానీ సీఎంని మాత్రం ఆమె పలకరించలేదు. ఆయన వద్దకు రాగానే ముఖం తిప్పుకొని నేరుగా తన సీటు వద్దకు వెళ్ళిపోయింది జయసుధ. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను పలకరించాలని చూసినప్పటికీ కూడా చూసి చూడనట్టుగా సీనియర్ నటి జయసుధ వెళ్లిపోయింది. 


 



మంత్రులే కాదు అటు నటులు కూడా రేవంత్ రెడ్డికి మర్యాద ఇవ్వడం లేదంటూ నెట్టింట్లో ఇప్పుడు కామెంట్ లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి గల కారణం ఏంటో సరిగ్గా తెలియదు కానీ అల్లు అర్జున్ కేసే దీనికి ప్రధాన కారణం అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఆయనను పరామర్శించడానికి పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఆ సమయం లో సెలబ్రిటీలపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి తోడు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. అలాగే టికెట్ ప్రైస్ పెంచడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో సినీ సెలబ్రిటీలు కాస్త గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇదీ చదవండి:  జియో బంపర్‌ హిట్‌ ప్లాన్‌ రూ.1234 రీఛార్జీ చేస్తే 11 నెలల వ్యాలిడిటీ.. మరిన్ని బెనిఫిట్స్‌ తెలిస్తే మైండ్‌బ్లోయింగ్‌..  


ఇదీ చదవండి: భర్తతో థాయిలాండ్‌లో చిల్‌ అవుతున్న కీర్తి సురేష్‌‌.. మహానటి రచ్చ మాములుగా లేదుగా, ఫోటోస్‌ వైరల్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి