Jio Affordable Plan: జియో యూజర్లకు బంపర్ హిట్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏడాది పాటుకు వర్తించే ఈ ప్లాన్ అతి తక్కువే. జియో ఈ సరికొత్త ప్లాన్ రూ.1234 ధరలో ఉంది. దీని వ్యాలిడిటీ 336 రోజులు వర్తిస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జీ చేస్తే 11 నెలలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జియో రూ.1234 ప్లాన్‌తో రీఛార్జీ చేస్తే 336 రోజుల వ్యాలిడిటీ అందుతుంది. ఇది కాకుండా ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, 0.5 జీబీ డేటా హైస్పీడ్ పొందుతారు. ఏ నెట్ వర్క్ అయిన అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకునే సౌకర్యం కూడా కలదు. ఇవి కాకుండా జియో సప్లిమెంటరీ యాప్స్ యాక్సెస్ కూడా పొందవచ్చు.
జియో అందిస్తున్న మరో వ్యాలెట్ ఫ్రెండ్లీ ప్లాన్ 336 రోజులు వ్యాలిడిటీ. ఈ ప్లాన్ అంటే కస్టమర్లకు కేవలం రూ.150 నెలకు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్లాన్ కూడా కేవలం రూ.1899 అందుబాటులో ఉంది.
జియో వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. మీరు 336 నిరంతరాయ సేవ పొందవచ్చు. సెకండ్ సిమ్ యాక్టీవ్‌గా ఉండాలి అనుకునే వారికి ఈ ప్లాన్ సిపోతుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 24 జీబీ పొందుతారు.
ఇది కాకుండా 3600 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. పెరిగిన టెలికాం ధరల తర్వాత జియో చాలామంది యూజర్లను పోగొట్టుకుంది. దీంతో మళ్లీ కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది. అతి తక్కువ ధరలోనే ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్స్ అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది ఆ టెలికాం కంపెనీకి ఆకర్షితులవుతున్నారు.
ఈ నేపథ్యంలో జియో కూడా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను తిరిగి ఆకట్టుకునే పనిలో పడింది. గత ఏడాది జూలైనెలలో టెలికాం ధరలు పెరగడంతో ఎక్కువ మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. కొత్త ప్లాన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ పరిచయం చేస్తూ వారిని తిరిగి ఆకుట్టుకునే పనిలో పడింది జియో.