Keerthy Suresh Thailand Photos: కిర్తీ సురేష్ 'బేబీ జాన్' సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ దావన్‌తో కలిసి హిందీలో ఎంట్రీ ఇచ్చిన మహానటికి ఇది ఛేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇదిలా ఉండగా కీర్తీ సురేష్ గత నెలలో తన చిన్న నాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇద్దరూ థాయిల్యాండ్ వెళ్లారు. ఆ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
కిర్తీ సురేష్ తెలుగు, తమిళ సినిమాల్లో అలరించిన మహానటి హిందీలో కూడా మొన్న బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 'మహానటి' అలనాటి నటి సావిత్రి బయోపిక్ నుంచి కిర్తీ సురేష్‌కు ఆ పేరు వచ్చింది.
అయితే, కిర్తీ సురేష్ గత నెలలో గోవా వేదికగా స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లో ఆమె వివాహం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలె కీర్తి సురేష్ తన ప్రేమకథ గురించి కూడా రివీల్ చేసింది. ఆంటోనీ ప్రపోజల్ గురించి వివరించింది. 12వ తరగతి నుంచి ప్రేమించుకున్నాం అని చెప్పింది.
అంతేకాదు అతను ఖాతర్‌లో జాబ్ చేయడంతో ఆరేళ్లు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం ని చెప్పింది.
ఆతర్వాత కొచ్చికి షిఫ్ట్ అయిన ఆంటోని అక్కడ, చెన్నైలో బిజినెస్‌లు పెట్టాడు. ఇక దుబాయికి కూడా బిజినెస్ విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికైనా సూపర్ హీరో డ్యాడ్ అవుతాడు, ఆ తర్వాత భర్త అవుతాడు అని చెప్పింది.
ఆంటోనీని చూస్తే నాకు గర్వంగా ఉంటుందని చెప్పింది. ఇక కీర్తి సురేష్ పెళ్లి అయిన రెండు రోజులకే బేబీ జాన్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా కనిపించింది.
ఆమె మెడలో పసుపుతాడుతో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. పెళ్లి జరిగిన ఇన్ని రోజులకు కిర్తీ సురేష్ భర్తతో వెకేషన్‌కు వెళ్లింది.
థాయిలాండ్‌లో భర్తతో కలిసి చిల్ అయింది. రకరకాల పోజులతో మహానటి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.