Allu Arjun thanking to Vijay Deverakonda | టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు దక్షిణాదిన గుర్తింపు ఉన్న హీరోలలో ఒకడు. తెలుగు వారికైతే పరిచయం అక్కర్లేని పేరు. స్టైలిష్ స్టార్‌గా టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు ఈ మెగా హీరో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు తెలిపాడు. అదేంటి.. అల్లు అర్జున్ ఎందుకు థ్యాంక్స్ ఎందుకు చెప్పాడు. ఏం జరిగిందో ఆ వివరాలు మీకోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అర్జున్ రెడ్డి ఫేమ్ , రౌడీ హీరో విజయ్ దేవరకొండ భావించాడు. బన్నీకి స్టైలిష్ గాగుల్స్‌తో పాటు రౌడీ హీరో బ్రాండ్ దుస్తులు కూడా గిఫ్ట్‌గా అందించాడు విజయ్ దేవరకొండ. ఈ విషయాన్ని తన అభిమానులకు తెలిసేలా చేశాడు బన్నీ. తనకు కూల్ పెయిర్ గిఫ్ట్‌గా ఇచ్చిన సోదరుడు విజయ్ దేవరకొండకు, రౌడీ క్లబ్‌కు థ్యాంక్స్ అని ట్వీట్ చేశాడు.


Also Read : Silk Smitha: టాలీవుడ్ నటి సిల్క్ స్మిత.. ఆసక్తికర విషయాలు


 



 


హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. హీరోల మధ్య మంచి రిలేషన్ ఉందంటూ బన్నీ ఫ్యాన్స్, రౌడీ హీరో ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బన్నీకి విజయ్ పంపించిన గాగుల్స్, రౌడీ బ్రాండ్ డ్రెస్ వేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


Photos: Family Photos of Vishnu Manchu; డాటర్స్ బర్త్‌డే.. మంచు విష్ణు ఫ్యామిలీ టైమ్ 


Also Read : Prabhas With KGF Director: క్రేజీ కాంబినేషన్.. మరో పాన్ ఇండియా మూవీకి భారీ ప్లాన్ 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook