Chandrabose wife Suchithra టాలీవుడ్ టాప్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన పాటలైనా, మాటలైనా అందరూ మంత్రముగ్దులవ్వాల్సిందే. అలాంటి చంద్రబోస్ పాటలకు, ఆయన భార్య సుచిత్ర ఆటలు తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబోస్‌తో సుచిత్ర పెళ్లి అయిన తరువాత డ్యాన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. మధ్యలో అడపాదడపా చిత్రాలు చేసినా కూడా గ్యాప్ మాత్రం కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇప్పుడు సుచిత్రా చంద్రబోస్ వీకెండ్ పార్టీ కోసం పని చేసింది. ప్రముఖ రచయిత బోయ జంగయ్య రాసిన అడ్డదారులు అనే నవల ఆధారంగా వీకెండ్ పార్టీ అనే సినిమాను నిర్మిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బోయ జంగయ్య కుమారుడు బోయ చేతన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీని అమరేందర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్, అక్షిత్ అంగీరస, రమ్య రాజ్, రమ్య నాని, సిరి, ప్రియా, గుంటూరు విజయ్, గీతా సింగ్, డిడి శ్రీనివాస్, కిట్టయ్య, హరిశ్చంద్ర, శరత్ కుమార్, నిట్టల, జయ నాయుడు, రమణి సిద్ధి, శ్రీమణి, లలితా రాజు, ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ ఆడియోను సీనియర్ పాత్రికేయుల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. వినాయకరావు, ప్రభు, సురేష్‌ కొండేటి వంటి వారు పాటలను రిలీజ్ చేశారు.


ఇలా తమ చేతులు మీదుగా పాటలను రిలీజ్ చేయించడం ఆనందంగా ఉందని వినాయకరావు, ప్రభు, సురేష్‌ కొండేటి అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పని చేసిన వారంతా కూడా తనకు ఆప్తులేనని అన్నాడు పల్లెటూరి గురించి పాట రాశానని, తన భార్యే అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేసిందని తెలిపాడు.


సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాతో 1992లో నృత్య దర్శకురాలిగా ప్రయాణం మొదలుపెట్టానని గుర్తు చేసుకుంది. ఇప్పుడు 2022లోనూ కొరియోగ్రఫీ చేస్తున్నానని, తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని తెలిపింది. చంద్రబోస్ గారు రాసిన పాటను వదలుకోకూడదని ఈ సినిమాను ఒప్పుకున్నానని, ఆయన ఎంతో గొప్ప సాహిత్యాన్ని అందించారని పేర్కొంది. తాను కంపోజ్ చేసిన పాటలు అందరూ వినండని, సినిమాను విజయవంతం చేయండని మ్యూజిక్ డైరెక్టర్ సదాచంద్ర కోరాడు. చంద్రబోస్ అన్న పాటలు రాయడం, నా పాటలకు సుచిత్ర వదినమ్మ కొరియోగ్రఫీ చేయడం అదృష్టమని కాసర్ల శ్యామ్ అన్నాడు. తమను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీడియాకు థాంక్స్ చెప్పాడు డైరెక్టర్ అమరేందర్. సుచిత్రా చంద్రబోస్ అయితే పాల బుగ్గల సాంగ్‌ను ఎక్కడా వల్గారిటీ లేకుండా కొరియోగ్రఫీ చేసిందని మెచ్చుకున్నాడు.


Also Read : Anasuya Bharadwaj : తాగుతారా? అంటూ నెటిజన్ ప్రశ్న.. చేతిలో ఒక్క షో లేకపోవడానికి కారణం చెప్పిన అనసూయ


Also Read : Rithu Chowdary: అందాల ప్రదర్శనతో రీతూ చౌదరి రచ్చ.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook