Gaalodu Official Trailer : సైలెన్స్, వయలెన్స్ తప్పా నీకేం తెలీదారా?.. దుమ్ములేపేసిన సుడిగాలి సుధీర్
Gaalodu Official Trailer సుడిగాలి సుధీర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సుధీర్ నటించిన గాలోడు సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్లు కాసేపటిక్రితం విడుదల చేశారు.
Sudigali Sudheer Gaalodu Trailer : సుడిగాలి సుధీర్ బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్‌తో దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా తన సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే మాస్ హీరోగా సుధీర్ ఈ సారి గట్టిగా హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. సుధీర్ తన స్టైల్, గెటప్, లుక్స్ అన్నీ మార్చుకుని గాలోడు అంటూ రాబోతోన్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అన్నీ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్‌లో సుధీర్ యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లో ఆకట్టుకున్నాడు. సుధీర్ వేసిన స్టెప్పులు కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్‌లో సుధీర్ చెప్పిన డైలాగ్‌లు, సుధీర్ క్యారెక్టరైజేషన్ గురించి ఇతర పాత్రలు చెప్పిన మాటలు అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. మా ఊర్లో నన్ను కుర్రాడు అని అనరు.. కొవ్వోడు అని అంటారు.. అని సుధీర్ చెప్పిన డైలాగ్ బాగుంది.
నువ్ శనివారం పుట్టావా? శనిలా తగులుకుంటేను.. ఎవడ్రా నువ్.. గొరిల్లాకు గాడ్ ఫాదర్‌లా ఉన్నావ్.. వీడు పక్కా గాలోడే.. అంటూ హీరోయిన్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. సైనైడ్ యాసిడ్ కంటే డేంజర్ అంటా.. రాక్షసుడి గురించి కథల్లో చదివాను.. విన్నాను.. కానీ మొదటి సారి వీడిలో చూశా.. సైలెన్స్, వయలెన్స్ తప్పా నీకేం తెలీదారా.. అంటూ సుధీర్ పాత్ర తీరు గురించి ఇతర పాత్రలు వివరిస్తూ చెప్పిన డైలాగ్స్, ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి.
ఇక ఈ ట్రైలర్ మాత్రం ఫుల్ మాస్ యాక్షన్ జానర్‌లా కనిపిస్తోంది. ఈ సినిమాతోనైనా సుధీర్ ఆశించిన విజయం దక్కుతుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో సుధీర్ పక్కన గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది.
Also Read : Acharya TRP Ratings : బాలయ్య, నాగ్, వెంకీల కన్నా దారుణం.. చిరు సినిమా స్థానమిదే
Also Read : సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ రివ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook