అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ( Pushpa ) సుకుమార్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో కన్నడ బ్యూటి రష్మికా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ గా జరుగుతున్న సమయంలోనే కరోనావైరస్ సంక్రమణ ( Coronavirus ) పెరగడం లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు.. 


అయితే ఇటీవలే షూటింగ్స్ మళ్లీ మొదలు అవ్వడంతో పుష్ప చిత్రీకరణను షురూ చేద్దాం అనుకుంటున్నాడు సుకుమార్ ( Sukumar ). అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చిపడింది. ఈ మూవీలో అల్లు అర్జున్ కు ధీటుగా ఉండే విలన్ కోసం సుకుమార్ తెగ వెతుకుతున్నాడు. కానీ ఈ విషయం ఏ మాత్రం కొలిక్కి రావడం లేదట.


పుష్ఫలో అల్లు అర్జున్ రెడ్ శాండిల్ స్మగ్లర్ పాత్రలో కనిపంచనున్నాడు. ఈ పాత్రా చాలా పవర్ ఫుల్ గా ఉండనుందట. బన్నీ పాత్రకు ధీటుగా ఉండేలా మరో పాత్రను డిజైన్ చేశాడట సుకుమార్. అయితే ఈ పాత్ర చేయడానికి ముందు తమిళ నటుడు విజయ్ సేతుపతిని (Vijay Sethupati ) అడిగాడట.



ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే


కానీ అతని డేట్స్ దొరక్క పోవడంతో మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టాడట. తరువాత నారా రోహిత్ ను కాంటాక్ట్ అయ్యాడట సుకుమార్. నారా రోహిత్ ఆల్మోస్ట్ ఓకే అని కూడా వార్తలు వచ్చాయి. కానీ రోహిత్ హీరోగా నటిస్తున్న సమయంలో సెకండ్ హీరోగా చేయడానికి అంతగా ఇష్టపడలేదట. అందుకే నో అని చెప్పాడట.


దీంతో చేసేది ఏం లేక చివరిగా మాధవన్ కు సంప్రదించగా మాధవన్ ఓకే చెప్పేశాడని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. పుష్ప మూవీని అల్లు అర్జున్ పాపులారిటీని బట్టి ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR