Suma Rajeev Kanakala Special Pooja యాంకర్ సుమ, రాజీవ్ కనకాలు ఎక్కువగా కలిసి కనిపించరు. ఇద్దరూ వేర్వేరు ఇంట్లో విడివిడిగా ఉంటారనే టాక్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా సుమ, రాజీవ్ కలిసి కనిపించారు. ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వీడియోను సుమ తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుమ, రాజీవ్ కనకాల పర్సనల్ విషయాలు ఎప్పుడూ ఇలానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. విడిపోయారని, విడాకులు తీసుకున్నారని రూమర్లు వస్తూనే ఉంటాయి. వాటిపై సుమ, రాజీవ్‌లు ఖండిస్తూనే ఉంటారు. తామిద్దరి మధ్య అలాంటివేమీ జరగలేదని, సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉండే గొడవలే తమ మధ్య కూడా ఉంటాయని, విడిపోయేంత గొడవలు లేవని రాజీవ్ కనకాల ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే.


రాజీవ్ కనకాల కరోనా సమయంలో ఓ సారి లైవ్‌లోకి వచ్చాడు. ఆ టైంలో సుమ కూడా లైవ్‌లో దర్శనం ఇచ్చింది. అయితే రాజీవ్, సుమ అలా ఒకే ఇంట్లో కనిపించడంతో రూమర్లన్నింటికి పుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. అయితే ఆ తరువాత సుమ షేర్ చేసే ఏ వీడియోల్లోనూ రాజీవ్ కనిపించే వాడు కాదు. దీంతో మళ్లీ రూమర్లు తెరపైకి వచ్చాయి.


Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్


అయితే ఇప్పుడు మళ్లీ ఇలా కలిసి కనిపించారు. ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉన్నారు. దీంతో ఈ విడాకుల రూమర్లకు పుల్ స్టాప్ పడ్డట్టు అయింది. ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టేసినట్టు తెలుస్తోంది. సుమ, రాజీవ్‌లు తమ కొడుకు రోషణ్ సినిమా ఎంట్రీ గురించి బాగానే కష్టపడుతున్నారు. కరోనా సమయంలోనే ఓ కొత్త సినిమాను కూడా లాంచ్ చేశారు. కానీ ఇంత వరకు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు.


Also Read: Saif Ali Khan Joins NTR 30 : ఎన్టీఆర్ కోసం రంగంలోకి సైఫ్ ఆలీ ఖాన్.. స్టిల్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook