నటి సురేఖా వాణికి ( Artist Surekha vani ) కోపమొచ్చింది. తనతో ఏ మగాడు కనపడినా.. అతడితో తనకు ఎఫైర్స్ అంటగట్టేస్తున్నారని నటి సురేఖా వాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎంతకు దిగజారారంటే... ఆఖరికి తనతో ఉన్నది కజినా, తన సోదరుడా అనే విషయం కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనపై వస్తున్న ఎఫైర్స్ రూమర్స్‌పై ఇటీవల సురేఖా వాణి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలివి. తన గురించి తప్పుడు మాటలు మాట్లాడే వారిని పట్టించుకోవడం మానేశానని అన్నారామె. గతేడాది సురేఖా వాణి భర్త సురేష్ తేజ ( Surekha vani's husband Suresh Teja ) చనిపోయిన సంగతి తెలిసిందే. Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌కి ముహూర్తం ఖాయం ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సురేఖా వాణి సినిమాల విషయానికొస్తే.. రారండోయ్ వేడుక చూద్దాం, ద్వారక, శమంతకమణి, బాద్‌షా, పిల్ల నువ్వు లేని జీవితం, శ్రీమంతుడు, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి హిట్ చిత్రాలే కాకుండా మరెన్నో చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల సురేఖా వాణి అంతగా సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఆమె ఇకపై తల్లి పాత్రలు చేయడానికి సిద్ధంగా లేకపోవడమేనట. ఐతే హీరోయిన్స్‌కి తల్లి పాత్రలు చేయాల్సిందిగా కోరుతూ ఎక్కువ అవకాశాలు వస్తున్నప్పటికీ... వాటికి సైన్ చేయడం ఇష్టం లేకే తాను సినిమాలకు దూరంగా ఉంటున్నానని.. త్వరలోనే తన కూతురు సుప్రీతను ( Surekha Vani's daughter Supritha ) హీరోయిన్‌గా లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని సురేఖా వాణి వెల్లడించినట్టు సమాచారం. Also read : Rana Daggubati: రానాకు బాగా ఇష్టమైన వంటకం ఏంటో తెలుసా ?


[[{"fid":"190973","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇటీవల సురేఖా వాణి కూతురు సుప్రీత బర్త్ డే వేడుకల ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. Also read : Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్


Also read : Kalyani Priyadarshan: సూపర్ స్టార్ కుమారుడితో డైరెక్టర్ కూతురు డేటింగ్