Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్

కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) రోజు రోజూ విజృంభిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.

Last Updated : Aug 18, 2020, 05:24 PM IST
Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్

కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) రోజు రోజూ విజృంభిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. అలాగే కరోనా బారిన పడుతున్న సినీ సెలబ్రిటీల ( Film celebrities ) సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ మధ్య లెజెండరి సింగర్ బాల సుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రి ( MGM hospital ) విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నాయి. Also read : చాలా ముఖ్యమైంది.. ప్లీజ్ వినండి..

తాజాగా టాలీవుడ్‌కే చెందిన మరో ఇద్దరు ప్రముఖ సింగర్స్‌కి కూడా కరోనావైరస్ సోకినట్టు తెలుస్తోంది. సునీత ( Singer Sunitha ), మాళవిక ( Singer Malavika ) కరోనావైరస్ బారిన పడ్డారు. వీరిద్దరు కూడా ఒకే సింగింగ్ షోలో పాల్గొన్నట్టు, ఆ సెట్లోనే వీరు వైరస్ బారిన పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రోగ్రాం చేసిన వారి నుండి ఇంకా చాలా మంది సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. Also read : Trisha: త్రిష వాటిని ఎందుకు డిలీట్ చేసింది ?

కరోనావైరస్ లక్షణాలు ( Coronavirus symptoms ) పెద్దగా లేకపోవడంతో ఈ ఇద్దరు సింగర్స్ ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా బారిన పడిన ప్రతీ ఒక్కరూ ఎలాగైతే త్వరగా నయమవాలని కోరుకున్నామో.. అలాగే ఈ ఇద్దరు సింగర్స్ కూడా త్వరగా కోలుకొని బయటికి రావాలని ప్రార్దిద్దాం. Also read : Thriller full movie leaked: థ్రిల్లర్ ఫుల్ మూవీ లీకైంది

Trending News