కొద్ది రోజుల క్రితం వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న రానా దగ్గుబాటి ( Rana Daggubati ).. సరిగ్గా పది రోజుల క్రితమే పెళ్లి చేసుకొని భార్య మిహీక బజాజ్‌తో ( Miheeka Bajaj ) కలిసి మీవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. అలాగే రానా దగ్గుబాటి పెళ్లి ఫొటోలు ( Rana Daggubati's wedding photos ) సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రానాకి ఫూడ్ ( Rana Daggubati's favourite food ) అంటే బాగా ఇష్టం అని కాకపొతే డైటింగ్‌లో ఉన్నందున తక్కువగా తింటాను అని అలాగే తనకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అనే ఆసక్తికరమైన అంశాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. Also read : V movie: వి మూవీ OTT రైట్స్ ఎంతో తెలుసా ?
రానాకి హైదరాబాదీ ఫుడ్స్ ( Hyderabadi foods ) చాలా ఇష్టం. అవి మాత్రమే కాకుండా వాళ్ల అమ్మమ్మ చేసే సాంబార్ ( Sambar ) అంటే ఇంకా చాలా చాలా ఇష్టం అని, తన చిన్ననాటి నుండే ప్రతీ రోజూ దాన్ని ఆస్వాదించేవాడినని రానా దగ్గుబాటి వెల్లడించాడు. Also read : Kalyani Priyadarshan: సూపర్ స్టార్ కుమారుడితో డైరెక్టర్ కూతురు డేటింగ్
ప్రస్తుతం రానా తన తల్లిదండ్రులతో కలిసి, ఉమ్మడి కుటుంబంలో ( Joint family ) నివసిస్తున్నాడు. ఉమ్మడి కుటుంబం అంటే రానాకి చాలా ఇష్టం అని, ఇదే మన సంస్కృతి అని, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబాన్నే అనుసరిస్తానని చెప్పాడు. రానా దగ్గుబాటి సినిమాల విషయానికొస్తే..., రానా తదుపరి చిత్రం అరణ్య మూవీ ( Aranya movie ) తమిళంలో కాదన్ ( Kaadan ), హిందీలో హాతీ మేరే సాతీ ( Hathi mere sathi ) వంటి టైటిల్స్‌తో మూడు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం రానా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also read : Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్