Surekha Vani - Swathi Muthyam : తాజాగా సురేఖా వాణి స్వాతి ముత్యం సినిమా సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో ఘనంగా విజయోత్సవ వేడుకకు నిర్వహించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఈవెంట్లో సురేఖా వాణి మాట్లాడుతూ.. తన కారెక్టర్ గురించి, వస్తోన్న రెస్పాన్స్ గురించి, సినిమా అవకాశాలు తగ్గడం గురించి మాట్లాడింది.  చాలామంది ఎక్కువ సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇలాంటి పాత్రలు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారట.  అవకాశమొస్తే ఎందుకు చేయనుఅని ప్రశ్నించింది సురేఖా వాణి.  దర్శకుడు లక్ష్మణ్ మొదటిసారి తనను కలిసి ఈ సినిమాలో తన పాత్ర గురించి తనకు చెప్పినప్పుడు.. నిజంగానే ఈ పాత్ర కోసం మొదట తనన్నే అనుకున్నారా అని అడిగిందట.


ఎందుకంటే ఇలాంటి పాత్రలు తమ వరకూ రావట్లేదని తన బాధను బయటపెట్టేసింది. . వస్తే తప్పకుండా చేస్తాం అని చెప్పుకొచ్చింది సురేఖా వాణి. తాను సినిమాలు మానేశాను అని కొందరు అనుకుంటున్నారట. తాను సినిమా అమ్మాయిని, ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది సురేఖా వాణి. తనకు ఇంతమంచి పాత్ర ఇచ్చిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇక మా అబ్బాయి గణేష్ నిజంగానే బంగారు కొండ. మొదటి సినిమానే ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ గారు ఇంకా ఎన్నో ఇలాంటి మంచి సినిమాలు తీయాలని, మా లాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ తన బాధను చెప్పకనే చెప్పేసుకుంది సురేఖా వాణి.


స్వాతిముత్యం హిట్ అవ్వడంపై గణేష్ మాట్లాడుతూ.. మాటలు రావడం లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. మొదటి సినిమా హిట్ అవ్వడంతో గణేష్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. కొత్త వారికి చాన్స్ ఇస్తుండటంపై నాగవంశీని వర్ష బొల్లమ్మ పొగిడేసింది. మొత్తానికి స్వాతిముత్యం మాత్రం డీసెంట్ ఎంటర్టైనర్‌గా అందరినీ అలరిస్తోంది.


Also Read : మెగా ఫాన్స్ ఆగ్రహం.. చిరంజీవితో మాట్లాడతా, అందరికీ చెప్పండి..లైవ్లోనే గరికపాటి!


Also Read : Dhanush - Aishwarya : మళ్లీ ఒక్కటవ్వబోతోన్న ఐశ్వర్య - ధనుష్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook