Suriya Donation For Irular Tribe: కోలీవుడ్​ స్టార్​ హీరో సూర్య, జ్యోతిక (Suriya Jyothika Movies) దంపతులు మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇరులర్​ ట్రైబ్​ (ఆదివాసీల) సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్​ (CM Stalin Helpline Number) సమక్షంలో చెక్​ను హైకోర్టు రిటైర్డ్​ న్యాయమూర్తి చంద్రూ, పాజ్హన్​కుడి ఇరులర్​ ట్రస్ట్​కు అందజేశారు. అంతకముందు కరోనా సమయంలోనూ తమ రాష్ట్ర సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఈ దంపతులు విరాళం ఇచ్చారు.   



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య నటించిన కొత్త చిత్రం 'జై భీమ్' (Jai Bhim Release Date)​.. నవంబరు 2నుంచి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అమెజాన్​ ప్రైమ్​లో (Jai Bhim on Amazon Prime) స్ట్రీమింగ్​ కానుంది. జ్ఞానవేల్‌ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. ఏ తప్పు చేయని బలహీన వర్గ (ఆదివాసి) మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో సూర్య కనిపించనున్నారు.


హైకోర్టు రిటైర్డ్​ న్యాయమూర్తి చంద్రూ బయోపిక్​ ఇది. సూర్య 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​, సాంగ్స్​ అభిమానులను ఆకట్టుకున్నాయి.  


Also Read: Deepavali Release Movies: దీపావళికి థియేటర్లలో ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే  


Also Read: Happy Birthday Ileana Dcruz: మత్తెక్కిస్తున్న ఇలియానా ఫోటోషూట్, హ్యాపీ బర్త్‌డే ఇలియానా   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook