రివ్యూ: కంగువా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటీనటులు: సూర్య, బాబీ దేవోల్, కార్తి,  దిశా పటానీ, యోగి బాబు, కేయస్ రవికుమార్, నటరాజన్ సుబ్రహ్మణ్యం, కోవై సరళ తదితరులు


ఎడిటర్: నిషాద్ యూసుఫ్


సినిమాటోగ్రఫీ: వెట్రి పళని స్వామి


సంగీతం: దేవీశ్రీ ప్రసాద్


నిర్మాత : కే ఈ జ్ఞానవేల్ రాజా


దర్శకత్వం: శివ


విడుదల తేది: 14-11-2024


సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ తో  ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ను ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో సూర్య సక్సెస్ అందుకున్నాడా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..



కథ విషయానికొస్తే..


ఫ్రాన్సిస్ (సూర్య) గోవాలో పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్ పట్టిస్తూ వారికి సాయం చేస్తూ ఉంటాడు. ఇతనికీ పోటీగా దిశా పటానీ  అదే పని చేస్తూ ఉంటుంది. అనుకోని పరిమాణాల నేపథ్యంలో ఓ బాబు.. ఫ్రాన్సిస్ ను కలుస్తాడు. ఆ బాలుడికి, ఫ్రాన్సిస్ ఏదో సంబంధం ఉందని అతనికీ ఏదో తెలియని జ్ఞాపకాలు వెంటాడుతుంతాయి.  సుమారు వెయ్యేళ్ల క్రితం  ఓ జాతికి యువరాజుగా ఉంటాడు. తన జాతి ఉన్నతి కోసం ఏం చేశాడు. అయిన కంగువా జాతికి, మిగిలిని జాతికి మధ్య యుద్ధం ఎందుకు మొదలైంది. తన జాతి బాగు కోసం కంగువా చేసిన పోరాటం ఏమిటి ? మరి ఫ్రాన్సిస్ కు కలిసిన బాబుకు కంగువాకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.  


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు శివ తాను రాసుకున్న అందమైన చందమామ కథను అదే రీతిలో తెరకెక్కించి ఉంటే బాగుండేది. సినిమా మూల కథ విషయానికొస్తే.. గత జన్మలో ఓ బాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం .. ఈ జన్మలో హీరో ఏం చేసాడనేదే ‘కంగువా’ స్టోరీ. ముఖ్యంగా మగధీర తరహాలో ఈ సినిమాను ప్రస్తుతం కాలంతో పాటు సామాన్య శకం1050 మధ్య కొన్ని తెగల మధ్య జరిగిన పోరాటాన్ని ఈ సినిమా కథగా ఎంచుకున్నాడు.  ముఖ్యంగా మన దేశంలో పంచ ద్వీప సమూహంలో భాగంగా సాగర కోన, హిమ కోన, అరణ్య కోన, కపాల కోన, ప్రణవాది కోన అనే ఐదు ద్వీపాలుంటాయి. వీటిని తెరపై అందంగా చూపించినా.. అందులో వివిధ తెగల క్యాస్టూమ్స్ చూస్తే ఏదో ఆదిమ కాలం నాటి సినిమా చూస్తున్నట్టు కనిపిస్తోంది. విపరీతమైన హింస, రక్తపాతం చికాకు తెప్పిస్తాయి. మధ్యలో మొసలితో ఫైటింగ్ మాత్రం ఉన్నంతలో కాస్త ఊరట అని చెప్పాలి. బాబుకు కంగువా మధ్య ఎమోషనల్ సీన్స్ అంతగా పండలేదు. మ


ముఖ్యంగా బాబీ దేవోల్ విలనిజాన్ని వాడుకున్నా.. మరి అతిగా ఉంది.  సినిమా మొత్తంగా గ్రాండియర్ తెరకెక్కించినా.. ఏదో తెలియని లోపం మనల్ని వెంటాడుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని సన్ని వేశాలను చూస్తుంటే వైల్డ్ యాక్షన్ సీన్స్ చూసే ప్రేక్షకులకు  జుగుప్సా లాంటివి కలుగుతాయి. ఫైనల్ గా ఈ జన్మలో మా తప్పిన సూర్య.. వెయ్యి తర్వాత మరో జన్మలో ఆ బాబును ఎలా కాపాడనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అయినా.. దాన్ని కాస్త కన్విన్సింగ్ గా చెబితే బాగుండేది. క్లైమాక్స్ లో ఎయిర్ ప్లేన్ లో ఫ్లైట్ కొన్నేళ్లు ట్రోలింగ్ కు పనికొచ్చేలా వండి వార్చాడు దర్శకుడు. ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ బాగున్నాయి.   మొత్తంగా సూర్య శ్రమను బూడిదలో పోసిన పన్నీరు అని చెప్పాలి. నిర్మాణ పరంగా , మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. దేవీశ్రీ ప్రసాద్ ఓ పాట బాగుంది. రీ రికార్డింగ్ బాగున్నా.. మరీ ఓవర్ అయినట్టు కనిపించింది.


 నటీనటులు విషయానికొస్తే..
సూర్య గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కంగువాగా తన యాక్టింగ్ తో ప్రాణం పోసాడు. తన జాతి కోసం, ఇచ్చిన మాట కోసం కట్టుబడే వ్యక్తి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు.  అటు ఫ్రాన్సిస్ గా పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా ఈ సినిమాకు అతనే ప్లస్ పాయింట్. సూర్యతో పాటు సినిమా మొత్తంగా నటించిన బాల నటుడు తన యాక్టింగ్ మెప్పించాడు. దిశా పటానీ ఓ పాటలో తన అందచందాలను ఆరబోయడానికి తప్ప ఎందుకు పనికి రాలేదు. ఇక విలన్ పాత్రలో బాబీ దేవోల్ తన విలనిజం పండించాడు.చివర్లో అతిథి పాత్రలో మెరిసిన కార్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.   మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.


ప్లస్ పాయింట్స్


సూర్య నటన


గ్రాఫిక్స్ వర్క్


నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


కథనం


దేవీశ్రీ సౌండింగ్


లాజిక్ లేని సీన్స్


ఇంటర్వెల్


పంచ్ లైన్.. ‘కంగువా’.. ఓ మోస్తరుగా మెప్పించే వైల్డ్ యాక్షన్ డ్రామా..


రేటింగ్..2.5/5


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter