Sushant Singh Rajput Pet బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన ఏ వార్త అయిన జనాలను ఆకట్టుకుంటుంది. ఆ మధ్య కూపర్ హాస్పిటల్ పోస్ట్ మార్టం సిబ్బంది చేసిన వ్యాఖ్యలు, సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ చేసిన కామెంట్లు ఒక్కసారిగా దేశాన్ని కుదిపేశాయి. సుశాంత్ సింగ్ కేసు సంగతి తేల్చండంటూ జనాలు ఈ ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉన్నాయి. కానీ ఇంత వరకు అసలు విషయం ఏంటన్నది బయటకు రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుశాంత్ సింగ్ మరణం చుట్టూ ఎన్ని చిక్కుముళ్లు అల్లుకున్నాయో అందరికీ తెలిసిందే. సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్ మరణం, రియా చక్రవర్తి ఇన్వాల్మెంట్, డ్రగ్స్ కేసు, మనీ లాండరింగ్, ఈడీ ఇలా ఎన్నెన్నో కోణాల్లో కేసును విచారించారు. సీబీఐకి కూడా అప్పగించారు. కానీ ఇంత వరకు సుశాంత్ సింగ్ మృతి విషయంలో ఓ క్లారిటీ అయితే రాలేదు. సుశాంత్ సింగ్ మరణంతోనే బాలీవుడ్ పతనం కూడా ప్రారంభమైందన్నట్టుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందీ చిత్ర సీమ కోలుకోవడం లేదు.


 



సుశాంత్‌కు ఎంతో ఇష్టమైన పెట్ చనిపోయిందంటూ అతని సోదరి ప్రియాంక ట్వీట్ వేసింది. ఎట్టకేలకు నువ్ కూడా నీ ఫ్రెండ్ ఉన్న స్వర్గానికి వెళ్లావా.. మేం కూడా ఎప్పటికైనా వస్తాం..  అంత వరకు మిస్ యూ అంటూ గుండె బద్దలైన ఎమోజీని ప్రియాంక షేర్ చేసింది. ఇక ప్రియాంక వేసిన ట్వీట్ మీద జనాలు స్పందిస్తున్నారు. హార్ట్ బ్రేకింగ్‌లా ఉందంటూ నెటిజన్లు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు కొన్ని రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సుశాంత్‌కు డ్రగ్స్ ఇవ్వడంలో రియాతో ఆమె సోదరుడి హస్తం కూడా ఉందన్న కారణంతో వారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook