SVP Success Meet, First time Mahesh babu dancing on Stage for MaMa Mahesha Song: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'సూపర్ స్టార్' అయినా కూడా ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఎక్కడైనా సరే చాలావరకు సెటిల్డ్‌గానే ఉంటారు. సెట్‌లో తన పని తాను చేసుకుంటూ వెళతారు. ఇక సినిమా వేడుకలలో స్టేజ్‌పైకి వస్తారు, అభిమానుల్లో జోష్ నింపే ప్రసంగం ఇచ్చి వెళ్లిపోతారు. అయితే ఎప్పుడూ కూడా స్టేజ్‌పై మహేష్ డాన్స్ చేసిన దాఖలు లేవు. తాజాగా 'సర్కారు వారి పాట' ఇచ్చిన సక్సెస్ జోష్ ఏమో తెలియదు కానీ.. మొదటిసారి వేదికపై డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 12న విడుదలైన 'సర్కారు వారి పాట' సినిమా బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఎస్‌వీపీ చిత్రంకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ రావడంతో.. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. మహేశ్ స్వాగ్‌ను అభిమానులు వెండితెరపై ఆస్వాదిస్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి రీజనల్ సినిమాగా ఎస్‌వీపీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా భారీ హిట్ కొట్టడంతో సోమవారం (మే 16) రాత్రి 'మమ మాస్‌ సెలబ్రేషన్స్‌' పేరుతో కర్నూలులో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


సక్సెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్ వేదికపైకి వెళ్లి 'మమ మహేశా' పాటకి డ్యాన్సర్లతో స్టెప్పులు వేశాడు. ఆ తర్వాత మహేశ్ బభౌ స్టేజ్‌పైకి వెళ్లి స్టెప్పులు వేశారు. సినిమాలో 'మమ మహేశా' ఉన్న స్పెప్స్ సూపర్ స్టార్ వేశారు. దీంతో అక్కడ ఉన్న మహేష్ అభిమానులు అరుపులతో ఊగిపోయారు. దాంతో అక్కడి సభ మొత్తం దద్దరిల్లిపోయింది. తమ అభిమాన హీరో లైవ్‌లో స్టెప్పులేయడాన్ని చూసి ఫ్యాన్స్ ఆనందపడ్డారు. 




మహేష్ బాబు మాట్లాడుతూ.. 'ఇదేదో సక్సెస్‌ మీట్‌లా లేదు. వంద రోజుల వేడుకలా ఉంది. ఫంక్షన్లంటూ చేస్తే రాయలసీమలోనే చేయాలి. చాలా ఏళ్ల క్రితం ఒక్కడు షూటింగ్ కోసం నేను కర్నూలుకి వచ్చా. ఇన్నేళ్ళ తర్వాత సర్కారు వారి పాట సక్సెస్ మీట్‌ కోసం ఇప్పుడు వచ్చా. నా కోసం ఇంతమంది అభిమానులు వస్తారని ఊహించలేదు. ఆ ఆనందంతోనే మీ కోసం స్టెప్పులు వేశా. నా కోసం ఇక్కడికి వచ్చినందుకు ప్రతిఒక్కరి థాంక్యూ. మీ అభిమానం, ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.మీ రుణం నేనెప్పటికీ మర్చిపోను. మీకు నచ్చే సినిమాలు చేస్తాను' అని అన్నారు. 


Also Read: Gold Price Today: మహిళలకు శుభవార్త.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే!


Also Read: Horoscope Today May 17 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook