Adipurush Teaser: మరీ ఇలా అయితే ఎలా.. నిర్మాణ సంస్థల మధ్య ఆ మాత్రం అండర్ స్టాండింగ్ లేదా?
T Series Removed Adipurush Teaser from UV Productions Youtube Channel: యూవీ క్రియేషన్స్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఆదిపురుష్ టీజర్ ను కాపీ రైట్ క్లెయిమ్ చేసి తొలగించింది. ఆ వివరాల్లోకి వెళితే
T Series Removed Adhipurush Teaser from UV Productions Youtube Channel: ప్రభాస్ హీరోగా అనేక సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ముందు నుంచి భారీ అంచనాలతో ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పరచుకుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుండగా కృతి సనన్ సీత పాత్రలో కనిపిస్తోంది.
సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ మీద పలు రకాల ట్రోల్స్ అయితే వస్తున్నాయి. మరీ నాసిరకం గ్రాఫిక్స్ వాడారని కార్టూన్ బొమ్మలతో టీజర్ నింపేశారని ఇలా రకరకాల ట్రోలింగ్స్ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఐమాక్స్, 3డీ ఫార్మాట్ లో కూడా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సహ నిర్మాణ సంస్థగా ప్రభాస్ సన్నిహితులకు సంబంధించిన యువీ ప్రొడక్షన్స్ సంస్థ కూడా ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. తాజాగా విడుదలైన టీజర్ ద్వారా ఆ విషయం మీద క్లారిటీ వచ్చింది. అయితే టి సిరీస్ సంస్థ హిందీ సహా మిగతా అన్ని భాషలకు సంబంధించిన టీజర్లను తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేసింది.
అయితే ఆసక్తికరంగా యూవీ ప్రొడక్షన్ సంస్థ కూడా తెలుగు టీజర్ను తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. అయితే ఇప్పుడు యూవీ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఆది పురుష్ టీజర్ కనిపించడం లేదు. అసలు విషయం ఏమిటంటే కాపీరైట్ క్లెయిమ్ కింద యువి ప్రొడక్షన్స్ అప్లోడ్ చేసిన టీజర్ను టీ సిరీస్ సంస్థ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంస్థతో నిర్మాణ సంస్థకు ఏ మాత్రం కోఆర్డినేషన్ లేని వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే టి సిరీస్ సంస్థ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని గతంలో కూడా రాధేశ్యామ్, సాహో సినిమాల విషయంలో కూడా ఇలాంటి పొరపాట్లు జరిగాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకమీదటైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే నలుగురిలో అభాసు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Alia Bhatt Baby Bump Photos: బేబీ బంప్ చూపిస్తూ ఆలియా ఫోజులు.. బ్లాక్ డ్రెస్ ఫోటోషూట్ చూశారా ?
Also Read: Allu Arjun Trivikram Shooting: అల్లు అర్జున్ తో షూట్ మొదలెట్టిన త్రివిక్రమ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook