Taapsee Pannu Booked: తాప్సీ పన్నుపై కేసు నమోదు.. హిందూ సంఘాల ఆగ్రహం
Taapsee Pannu Booked For Hurting Hindu Sentiments: తాప్సీ పన్నుపై కేసు నమోదైంది. మార్చి 12న ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ లో తన ఫ్యాషన్ పరేడ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోను జత చేస్తూ మార్చి 14న ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు చూసిన హిందూ ధార్మిక సంఘాలు తాప్సీ పన్నుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
Taapsee Pannu Booked For Hurting Hindu Sentiments: తాప్సీ పన్నుపై కేసు నమోదైంది. మార్చి 12న ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తన ఫ్యాషన్ పరేడ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోను జత చేస్తూ మార్చి 14న ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టు చూసిన హిందూ ధార్మిక సంఘాలు తాప్సీ పన్నుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అందుకు కారణం ఆమె తన శరీరంపై భాగాన్ని ఎక్స్‌పోజింగ్ చేస్తూ ధరించిన డ్రెస్సుపై లక్ష్మీ దేవి విగ్రహం ఉన్న నెక్లెస్‌ని ధరించడమే.
తాప్సీ పన్ను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసిన హిందూ రక్షర్ సంఘటన్ అనే హిందూ ధార్మిక సంస్థ తాప్సీ పన్నుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నేరం కింద తప్సీ పన్నుపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన బీజేపి ఎమ్మెల్యే మాలిని గౌర్ తనయుడు అయిన ఏకలవ్య సింగ్ గౌర్ హిందూ రక్షర్ సంఘటన్ తరపున తాప్సి పన్నుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకలవ్య సింగ్ గౌర్ హిందూ రక్షర్ సంఘటన్ సంస్థకు కన్వినర్ గా పనిచేస్తున్నారు.
ఇండోర్ పోలీసులు ఈ ఫిర్యాదుపై స్పందిస్తూ.. ఏకలవ్య సింగ్ గౌర్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశామని అన్నారు. తనపై నమోదైన కేసుపై తాప్సీ పన్ను స్పందించాల్సి ఉంది. ఏదేమైనా తాప్సీ పన్ను చేసిన ఫ్యాషన్ వాక్ ఆమెను వివాదంలోకి నెట్టేయడంతో పాటు కేసుల పాలు చేసిందన్న మాట మాత్రం వాస్తవం. ఏ అంశంపైనైనా నిర్మొహమాటంగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చే తాప్సీ పన్ను ఈ ఘటనపై ఎలా స్పందిస్తుందా అనేదే ప్రస్తుతం వేచిచూడాల్సిన అంశం.
ఇది కూడా చదవండి : Ram Charan Lineup: మెంటల్ ఎక్కిస్తున్న రామ్ చరణ్ మాస్ లైనప్.. ఎవరెవరితో సినిమాలు ఉన్నాయంటే?
ఇది కూడా చదవండి : Saif Ali Khan Son News: స్టార్ హీరో కుమారుడు గే.. సంచలనం రేపుతున్న ట్వీట్!
ఇది కూడా చదవండి : Seerat Kapoor Pics: సీరత్ కపూర్ స్టన్నింగ్ ఫొటోస్.. బ్యాక్ చూపిస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేశారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK