Tamannaah Bhatia to Marry Mumbai Businessman: తమన్నా భాటియా.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినా.. తెలుగులో 'శ్రీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.  2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తమన్నాకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆవారా,  కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ సినిమాలు తమన్నాను ఇండస్ట్రీలో నిలబెట్టాయి. ఊసరవెల్లి, రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునున్నారు. ఇక బాహుబలి సినిమాతో తమన్నా రేంజ్ మరో స్థాయికి చేరుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమన్నా నటనా పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా చాలా క్రేజ్ ఉంది. అమ్మడికి 'మిల్కీ బ్యూటీ' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. నటన, గ్లామర్ మాత్రమే కాదు.. తమన్నా అద్భుతంగా డాన్స్ చేస్తారు. టాలీవుడ్ టాప్ డ్యాన్సర్లు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్‌లతో పోటాపోటీగా డ్యాన్స్ చేయగల ఏకైక హీరోయిన్ తమన్నానే. తమన్నా వెండితెరకు పరిచయమై 17 ఏళ్లు గడిచినా.. ఫేమ్, పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల జోరు తగ్గించిన మిల్కీ బ్యూటీ.. బాలీవుడ్, టాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తున్నారు.


తమన్నా పెళ్లి‌పై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మిల్కీ బ్యూటీ పెళ్లికి సంబందించిన చాలా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని సున్నితంగా సమాధానం ఇచ్చేవారు. దీంతో ఆ రూమర్స్ కు చెక్ పడేవి. తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈసారి తమన్నా తన పెళ్లి  వార్తలపై స్పందించకపోవడంతో.. అవి నిజమే అని అర్ధమవుతోంది.


తమన్నా త్వరలో ముంబైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్దమయిందని ఆ వార్తల సారంశం. అందులో భాగంగా ప్రస్తుతం సినిమాలను కూడా తగ్గింశారని కొందరు అంటున్నారు. కొన్ని రోజుల క్రితమే మిల్కీ బ్యూటీ తన పెళ్లికి ఓకే చెప్పారట. పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో. తన పెళ్లి నిర్ణయం తల్లిదండ్రులకే వదిలేసినట్లు ఎన్నోసార్లు తమన్నా చెప్పారు. ఇప్పుడు కూడా పెద్దలు తీసుకొచ్చిన అబ్బాయికే ఓకే చెప్పారట. 


Also Read: ఐపీఎల్ 2023 మినీ వేలం.. జింబాబ్వే ప్లేయర్‌పై కురవనున్న కాసుల వర్షం! మూడు ప్రాంఛైజీలు పోటీ


Also Read: SRH Retained Players List: కేన్ మామకు భారీ షాకిచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ జాబితా ఇదే!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook