PA..PA Movie: తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. తెలుగులో రిలీజ్‌కు రెడీ
PA PA Movie: తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన డా..డా మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. పా..పా పేరుతో జనవరి 3న థియేటర్లలో సందడి చేయనుంది. తమిళంలో తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం.. రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టింది.
PA PA Movie: తండ్రీకొడుకుల సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో తమిళంలో తెరకెక్కిన మూవీ డా..డా. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. పా..పా పేరుతో జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జనవరి 3వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంలో కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రదారులుగా నటించారు. గణేష్ కె బాబు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అవ్వగా.. ఆడియన్స్‌కు చిరకాలం గుర్తుండిపోతాయని మేకర్స్ చెబుతున్నారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. తమిళంలో బ్లాక్‌బాస్టర్ హిట్ అయిందని.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. జవవరి 3వ తేదీన అందరూ తప్పకుండా థియేటర్‌లో పా..పా సినిమాను చూడాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయబోతున్నారని వెల్లడించారు.
==> ప్రొడక్షన్ హౌస్: JK ఎంటర్టైన్మెంట్స్
==> ప్రొడ్యూసర్: నీరజ కోట
==> హీరో: కవిన్,
==> హీరోయిన్: అపర్ణా దాస్
==> నటీనటులు: భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి
==> సంగీతం: జెన్ మార్టిన్
==> సాహిత్యం: రవివర్మ ఆకుల
==> PRO: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల.
Also Read: Telagnana Assembly: కేటీఆర్ సంచలనం.. తొలిసారి రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు
Also Read: Jio Plans: ఆ రెండు ప్లాన్స్‌లో మార్పులతో యూజర్లకు షాక్ ఇచ్చిన జియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.