Jio Plans: ఆ రెండు ప్లాన్స్‌లో మార్పులతో యూజర్లకు షాక్ ఇచ్చిన జియో

Jio Plans: రిలయన్స్ జియో మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇటీవల వివిధ ప్లాన్స్ టారిఫ్ పెంచిన జియో ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చింది. కీలకమైన రెండు ప్లాన్స్‌లో మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 30, 2024, 03:21 PM IST
Jio Plans: ఆ రెండు ప్లాన్స్‌లో మార్పులతో యూజర్లకు షాక్ ఇచ్చిన జియో

Jio Plans: దేశవ్యాప్తంగా 490 మిలియన్లకు పైగా కస్టమర్లను కలిగి ఉన్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటుంది. కొన్ని ప్లాన్స్‌లో మార్పులు చేర్పులు చేస్తుంటుంది. అందులో బాగంగానే రెండు అతి ముఖ్యమైన ప్లాన్స్‌లో మార్పులు చేసింది. ఈ మార్పులతో డేటా అత్యధికంగా అవసరమయ్యేవారి జేబు గుల్ల కానుంంది. 

రిలయన్స్ జియో రెండు ప్లాన్స్‌లో మార్పులు చేసింది. అందులో 19 రూపాయలు, 29 రూపాయల వోచర్లు ఉన్నాయి. జూన్ నెలలో టారిఫ్ పెంచి షాక్ ఇచ్చిన జియో తాజాగా ప్లాన్స్‌లో మార్పులు చేస్తోంది. ఇప్పుడు మరోసారి రెండు కీలక మార్పులు చేసింది. జియో కస్టమర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ, ప్రీమియం ప్లాన్స్ అందిస్తోంది. ఈ మార్పులు 19 రూపాయలు, 29 రూపాయల ప్లాన్స్‌లో చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఈ రెండు డేటా అప్‌గ్రేడ్ ప్లాన్స్. ఇందులో వాయిస్ కాలింగ్ ఉండదు. 

19 రూపాయల డేటా వోచర్ ప్లాన్ గతంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ వ్యాలిడిటీని కలిగి ఉండేది. అంటే ఒకవేళ మీ ప్రస్తుతం ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుంటే 19 రూపాయల డేటా వోచర్ ప్లాన్ కూడా అన్ని రోజులు పనిచేసేది. కానీ ఇప్పుడు ప్లాన్‌లో మార్పులు వచ్చాయి. 19 రూపాయల డేటా వోచర్ ప్లాన్ వ్యాలిడిటీ తగ్గిపోయింది. ఇప్పుడిక ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 రోజుకే ఉంటుంది. ఈ ప్లాన్‌లో లభించే 1 జీబీ డేటా ఆ రోజే వాడేయాల్సి ఉంటుంది. 

ఇక మరో ప్లాన్ 29 రూపాయల డేటా వోచర్ ప్లాన్. ఈ ప్లాన్ లో 2జీబీ డేటా లభిస్తుంది. ఇది ఇప్పుడు కేవలం రెండ్రోజులే పనిచేస్తుంది. గతంలో అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ప్లాన్ వ్యాలిడిటీ ప్రకారం ఉండేది. కానీ ఇప్పుడు వ్యాలిడిటీని కేవలం 2 రోజులకే తగ్గించింది.

Also read: Ind vs Aus Test: నాలుగో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓటమి, సిరీస్ 2-1 ఆసీస్ వశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News